Coronavirus: క్రీడల కోసం ఇంతటి క్రూర నిబంధనలా.. విస్తుగొలుపుతోన్న చైనా కరోనా ఆంక్షలు..

ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా మహమ్మారి చైనాలోని వుహాన్‌లోనే పురుడుపోసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ప్రపంచ దేశాలన్ని డ్రాగన్‌పై దుమ్మెత్తిపోశాయి.

Coronavirus: క్రీడల కోసం ఇంతటి క్రూర నిబంధనలా.. విస్తుగొలుపుతోన్న చైనా కరోనా ఆంక్షలు..
Coronavirus
Follow us
Basha Shek

|

Updated on: Jan 13, 2022 | 10:13 AM

ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా మహమ్మారి చైనాలోని వుహాన్‌లోనే పురుడుపోసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ప్రపంచ దేశాలన్ని డ్రాగన్‌పై దుమ్మెత్తిపోశాయి. కాగా ఇప్పుడు మళ్లీ ఆ దేశంలో ఒమిక్రాన్‌తో పాటు కరోనా కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరోవైపు ఫిబ్రవరి 4 నుంచి చైనా రాజధాని బీజింగ్‌ వేదికగా వింటర్ ఒలింపిక్స ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో క్రీడలను సజావుగా నిర్వహించేందుకు ‘జీరో కొవిడ్‌’ పాలసీని అమలుచేస్తోంది చైనా ప్రభుత్వం. క్రీడలు ప్రారంభయమ్యేలోగా జీరో కేసులే లక్ష్యంగా పలు ప్రాంతాల్లో కఠినమైన నిబంధనలు, ఆంక్షలు విధిస్తోంది. తద్వారా అక్కడి పౌరులను శారీరకంగా, మానసికంగా వేధిస్తోంది. ఇందులో భాగంగా మిలియన్ల మంది ప్రజలను కిక్కిరిసిన మెటల్‌ బాక్స్‌లలో నిర్భంధిస్తోంది. అందులో కేవలం ఒక చెక్కమంచం మాత్రమే ఉంటుంది. టాయిలెట్‌ కూడా అందులోనే. గర్భిణీలు, చిన్న పిల్లలు అనే కనికరం కూడా చూపించడం లేదు. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

కాగా చైనాలో కరోనా బాధితులను గుర్తించేందుకు అక్కడి అధికారులు ట్రాక్‌ అండ్‌ ట్రేస్‌ యాప్‌ను వినియోగిస్తున్నారు. దీని ద్వారా వైరస్ బాధితుల కదలికలపై నిత్యం కన్నేసి ఉంచుతున్నారు. ఈ కఠిన ఆంక్షల కారణంగా ​ చైనాలో ఇప్పుడు దాదాపు 20 మిలియన్ల మంది ప్రజలు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆఖరికి ఆహారం, తదితర నిత్యావసరాలు కూడా కొనడానికి కూడా తమ ఇంటి నుంచి బయటకు రానివ్వడం లేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు. కాగా జీరో కొవిడ్‌ పాలసీలో భాగంగా చైనా అధికారులు పాటిస్తోన్న నిబంధలనకు సంబంధించి కొన్ని వీడియోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. ఈ వీడియోల్లో కరోనా సోకిన వారిని తీసుకువెళ్లేందుకు బస్సుల వరుసలు, మరోవైపు ప్రజలను నిర్భంధించిన మెటల్‌ బాక్స్‌ల వరుసలను మనం చూడవచ్చు. గర్భిణీ స్త్రీలు, పిల్లలు వృద్ధులతో సహా ప్రజలు, చెక్క మంచం, టాయిలెట్‌తో అమర్చబడిన ఈ కిక్కిరిసిన బాక్స్‌ల్లో ఉండేలా బలవంతం చేస్తోంది. ఇక పలు ప్రాంతాల్లో నివాసితులను అర్ధరాత్రి దాటిన తర్వాత తమ ఇళ్లను విడిచిపెట్టి, నిర్భంధ కేంద్రాలకు వెళ్లాలని ఆదేశిస్తోంది. కాగా వీటిపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి బారిన పడేసి అపకీర్తి మూటగట్టుకున్న డ్రాగన్‌ ఇప్పుడు కరోనా కట్టడి కోసం పౌరులపై కఠిన ఆంక్షలు చేస్తోందని మండిపడుతున్నారు.

Also Read:

Scholarships: కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

Pushpa: మళ్లీ పుష్పరాజ్‌గా మారిన టీమిండియా క్రికెటర్‌.. ఈసారి ఏకంగా నోట్లో బీడీ పెట్టుకుని..

Vaikunta Ekadasi: తిరుమలలో ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు.. శ్రీవారి ఏకాంత సేవలో పాల్గొన్న సీజే ఎన్వీ రమణ..