Knowledge: గబ్బిలాల ద్వారా వైరస్‌ల సంక్రమణ.. మరి అవెందుకు జబ్బు పడవంటే..

సాధారణంగా గబ్బిలాలు మానవ సమూహానికి చాలా దూరంలో నివసిస్తాయి. ఎక్కువగా అడవులు, పాడుబడ్డ భవనాల్లో మాత్రమే ఎక్కువగా ఇవి కనిపిస్తుంటాయి.

Knowledge: గబ్బిలాల ద్వారా వైరస్‌ల సంక్రమణ.. మరి అవెందుకు జబ్బు పడవంటే..
Follow us
Basha Shek

|

Updated on: Jan 13, 2022 | 9:48 AM

సాధారణంగా గబ్బిలాలు మానవ సమూహానికి చాలా దూరంలో నివసిస్తాయి. ఎక్కువగా అడవులు, పాడుబడ్డ భవనాల్లో మాత్రమే ఎక్కువగా ఇవి కనిపిస్తుంటాయి. కానీ ప్రస్తుతం కునుకులేకుండా చేస్తున్నా కరోనాతో సహా గతంలో ప్రపంచాన్ని పట్టి పీడించిన ఎబోలా, నిఫా, రేబిస్ తదితర వైరస్‌ లకు వాహకాలుగా గబ్బిలాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు నివేదించారు. అసలే మానవ సమూహాలకు చాలా దూరంగా ఉండే గబ్బిలాలు మనుషుల్లో వైరస్‌లను ఎలా వ్యాప్తిచేస్తున్నాయి? అంతటి ప్రమాదకరమైన వైరస్‌లకు వాహకాలుగా ఉన్నప్పుడు మరి అవెందుకు జబ్బు పడడం లేదో తెలుసుకుందాం రండి.

ఇమ్యూనిటీ పవర్‌ కారణంగానే..

గబ్బిలాలు ఎగరడానికి ఎక్కువ శక్తి అవసరమని నివేదికలు చెబుతున్నాయి. అందుకోసం అవి ఎక్కువ తీపి, ప్రొటీన్ కలిగిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటాయట. తమ ఆకలిని తీర్చుకోవడానికి ఎక్కువగా పండ్లు, పూల రసాలు, కీటకాలను తింటాయట. రక్తం కూడా తాగుతాయట. ముఖ్యంగా గబ్బిలాలు కొరికిన పండ్లను మనుషులు తీసుకోవడం, అందులోని లాలాజలం ద్వారా వివిధ రకాల వైరస్‌లు మనుషులకు సంక్రమిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పైగా గబ్బిలాలన్నీ దాదాపు ఒకే సమూహంలో నివసించడం వల్ల ఒకదాని నుంచి మరొకరికి వేగంగా వైరస్‌లు వ్యాపిస్తాయి. ఈ కారణం వల్లనే మనుషులు ఎక్కువగా వివిధ రకాల వైరస్‌ ల బారిన పడుతున్నారట. గతంలో కేరళలో నిఫా వైరస్‌ అల్లకల్లోలం సృష్టించినప్పుడు పండ్లు తినకండని సూచించడం గబ్బిలాలు ఎలా వైరస్‌లు వ్యాప్తి చేస్తాయో ప్రత్యక్ష నిదర్శనం.

ప్రపంచంలో 1200 కంటే ఎక్కువ జాతుల గబ్బిలాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే గబ్బిలాలకు వివిధ రకాల వైరస్‌లు సోకినప్పటికీ అవి ఎక్కువగా జబ్బు పడవు. దీనికి శాస్త్రవేత్తలు చెబుతున్న కారణమేంటంటే.. మనుషులతో పోల్చుకుంటే గబ్బిలాలకు రోగనిరోధక శక్తి చాలా బలంగా ఉంటుందని, అందుకే వైరస్‌ ల ప్రభావం వాటిపై ఉండదట. వైరస్‌ల వల్ల వచ్చే వ్యాధులతో పోరాడేందుకు గబ్బిలాల శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ అనుకూలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కారణంగానే గబ్బిలాలతో వైరస్‌లు మనుషులకు సంక్రమిస్తాయి కానీ వాటికి ఎలాంటి ముప్పు ఉండదట.

Also read:

Silver Price Today: వెండి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన సిల్వర్‌ ధర.. అక్కడ మాత్రం పరుగులు పెట్టింది!

OnePlus 10 Pro: మార్కెట్లోకి వ‌న్‌ప్ల‌స్ కొత్త ఫోన్‌.. ఫీచ‌ర్లు తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..

Pooja Hegde: బుట్ట‌బొమ్మ స్టెప్‌ను సృష్టించింది తామే అంటోన్న పూజా.. అర్హ‌తో ఆస‌క్తిక‌ర‌మైన వీడియో..