- Telugu News Photo Gallery Science photos CES 2022 Massage Robots Virtual Coast ride the latest technology mesmerized viewers
CES 2022: మసాజ్ చేసే రోబోలు.. గురక నివారించే దిండ్లు.. సరికొత్త టెక్నాలజీ మన ముందుకు!
అమెరికా లాస్ వెగాస్‌లో కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES 2022) ఇటీవల ముగిసింది. 3 రోజుల పాటు జరిగిన ఈ ఈవెంట్‌లో అద్భుతమైన గ్యాడ్జెట్లు, టెక్నాలజీ కనిపించాయి. ఇందులో గురక దిండ్లు నుంచి 90-డిగ్రీల కోణంలో తిరిగే హ్యుందాయ్ వ్యాన్ వరకు అన్నీ ఉన్నాయి. దీంతో పాటు మసాజ్ చేసే ఇలాంటి రోబోలు కూడా కనిపించాయి. అటువంటి 5 టాప్ టెక్నాలజీల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Updated on: Jan 13, 2022 | 9:52 AM

1.మసాజింగ్ రోబోట్‌లు మసాజింగ్ రోబోలు ప్రదర్శనలో కనిపించాయి. ఇందుకోసం రోబోటిక్స్ బూత్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ సాంకేతికత సహాయంతో, రోబోలు మొత్తం శరీరాన్ని మాత్రమే మసాజ్ చేస్తాయి.

2. దిండులతో గురక నుంచి ఉపశమన.. ఈ స్మార్ట్ దిండు నిద్రిస్తున్నప్పుడు గురకను దూరం చేస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల భాగస్వామికి గురక శబ్దానికి అంతరాయం కలగదు.

3. జీరో ఎమిషన్ ఫ్లయింగ్ కార్ స్కైడ్రైవ్ కంపెనీ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారును సిద్ధం చేసింది. ఇందులో ఎలాంటి కాలుష్యం ఉండదని కంపెనీ పేర్కొంది.

4. వర్చువల్ కోస్ట్ రైడ్ ఈ టెక్ సహాయంతో, మీరు రియల్ టైమ్ కోస్ట్ రైడింగ్‌ని ఆస్వాదించవచ్చు.

5.Hyundai90-డిగ్రీల తిరిగే ఎలక్ట్రిక్ వ్యాన్.. హ్యుందాయ్ M.Vision POP ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రదర్శించింది. దీనికి 90 డిగ్రీలు తిరిగే చక్రాలు ఉన్నాయి. వీటి సహాయంతో, వ్యాన్‌ను 360 డిగ్రీల వరకు తిప్పవచ్చు. ఇది హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనం.



