- Telugu News Photo Gallery Technology photos One Plus smart phone launches new smart phone one plus 10 pro have a look on features
OnePlus 10 Pro: మార్కెట్లోకి వన్‌ప్లస్ కొత్త ఫోన్.. ఫీచర్లు తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..
OnePlus 10 Pro: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో తాజాగా ఒప్పోప్లస్ 10 ప్రో పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదిరిపోయే ఫీచర్లతో తీసుకొచ్చిన ఈ ఫోన్ వివరాలు..
Updated on: Jan 13, 2022 | 6:10 AM

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ తాజాగా వన్‌ప్లస్ ప్రో పేరుతో మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం చైనాలో విడుదల చేసిన ఈ ఫోన్‌లో త్వరలోనే ప్రపంచ మార్కెట్లోకి తీసుకరానున్నారు.

ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్ క్యూహెచ్‌డీ+తో కూడిన అమోఎల్‌డీ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో నడిచే ఈ ఫోన్‌లో 12జీబీ ఎల్‌పిడిడిఆర్ 5 ర్యామ్‌ను అందించారు.

కెమెరా విషయానికొస్తే ఇందులో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరాతో పాటు 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎమ్ ఎక్స్615 ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

5000 ఎమ్ఎహెచ్ డ్యూయల్ సెల్ బ్యాటరీతో కూడిన ఈ ఫోన్‌లో 80 వాట్ సూపర్ ఫ్లాష్ ఛార్జ్ వైర్డ్ ఛార్జింగ్, 50 వాట్ వైర్ లెస్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ అందించారు.





























