- Telugu News Photo Gallery Technology photos Whatsapp planning to bring new feature users can listen audio message in background
WhatsApp: మరో ఆకట్టుకునే ఫీచర్‌తో రానున్న వాట్సాప్.. ఇకపై వాయిస్ మెసేజ్‌లను అలా కూడా వినొచ్చు..
WhatsApp: మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ మొదటి వరుసలో ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది...
Updated on: Jan 14, 2022 | 6:10 AM

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్ మొదటి స్థానంలో ఉంటుంది. యూజర్ ప్రెండ్లీగా ఉంటుంది కాబట్టే ఈ యాప్‌కు అంతటి క్రేజ్.

ఇక ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేసే వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. సాధారణంగా వాట్సాప్‌లో మనకు వచ్చే వాయిస్ మెసేజ్‌ను ప్లే చేసి చాట్ పేజ్ నుంచి బయటకు వస్తే ఆడియో ఆగిపోతుంది. ఇది మనకు తెలిసిందే.

అయితే తాజాగా వాట్సాప్ తేనున్న కొత్త ఫీచర్‌తో బ్యాగ్రౌండ్‌లో కూడా వాయిస్ మెసేజ్‌ను వినొచ్చు. ఈ విషయాన్ని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది.

ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఇకపై యూజర్లు ఆడియో మెసేజ్ వింటూనే ఇతరులతో చాటింగ్ చేసుకోవచ్చు.

అంతేకాకుండా రికార్డు చేసిన ఆడియోను ఇతరులకు పంపే ముందు ప్రివ్యూ చూసుకునేందుకుగాను.. ప్రివ్యూ వాయిస్ నోట్స్ పేరుతో కొత్త అప్‌డేట్‌ను త్వరలోనే తీసుకురానుంది.





























