- Telugu News Photo Gallery Technology photos How to reverse image search on your Android phone in 2 ways using Google Chrome
Google Image: మీరు గూగుల్ నుంచి డౌన్‌లోడ్ చేసిన ఫోటోలు నకిలీవా..?నిజమైనవా..? గుర్తించడం ఎలా..?
Google Image: మనం గూగుల్ నుంచి ఎన్నో ఫోటోలను తీసుకుంటుంటాము. వివిధ రకాల ఫోటోలను వాడుతుంటాము. మనకు కావాల్సిన ఫోటోలు గూగుల్‌లో..
Updated on: Jan 12, 2022 | 5:27 PM

Google Image: మనం గూగుల్ నుంచి ఎన్నో ఫోటోలను తీసుకుంటుంటాము. వివిధ రకాల ఫోటోలను వాడుతుంటాము. మనకు కావాల్సిన ఫోటోలు గూగుల్‌లో సెర్చ్ చేస్తే కుప్పలు తెప్పలుగా కనిపిస్తాయి. కానీ ఆ ఫోటోలు ఎక్కడి.. అసలైన ఫోటోలా..? నకిలీవా అన్న విషయం తెలియదు. అలాంటి ఫోటోలు తీసుకునే ముందు అవి అసలైన ఫోటోలా..? నకిలీ ఫోటోలా గుర్తించవచ్చు. కొన్ని ఫోటోలు నకిలీవి ఉండి గ్రాఫిక్స్‌ను జోడించి తయారు చేస్తారు.

గ్రాఫిక్స్‌తో తయారు చేసిన ఫోటోలు ఎక్కువ శాతం రాజకీయ నాయకులు, సెలబ్రేటీలవి ఉంటాయి. నిజమైన ఫోటోలు కాకుండా గ్రాఫిక్స్‌ను జోడించినవి ఉంటాయి. అలాంటి ఫోటోలను చిన్న ట్రిక్‌ను ఉపయోగించి గుర్తించే అవకాశం ఉంటుంది.

ఆన్‌లైన్‌లో ఎక్కువగా ఫోటోలను సెర్చ్ చేయడానికి ప్రధానంగా ఉపయోగించేది గూగుల్. గూగుల్‌లో మనకు కనిపించే ఫోటోలు నిజమా..? కదా అనేది గూగుల్ ఇమేజెస్ మనకు రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఆప్షన్‌ను అందిస్తుంది. మనం ఏదైనా ఇమేజ్ వెతికినప్పుడు ఆ ఇమేజ్ విషయంలో మీకు ఏదైనా అనుమానం ఉంటే గూగుల్ ఇమేజెస్‌కు వెళ్లి కెమెరా ఐకాన్ మీద క్లిక్ చేయాలి. మీరు చూసిన ఫోటో యూఆర్‌ఎల్ లేదా ఆ ఫోటోను నేరుగా అప్లోడ్ చేయాలి. అప్పుడు వెంటనే గూగుల్ ఆ ఫోటో ఎక్కడి నుంచి వచ్చిందో.. దాని మూలం ఎక్కడిదో మనకు పూర్తిగా తెలిసిపోతుంది.

గూగుల్ సెర్చ్: మీ ఆండ్రాయిడ్ పరికరంలో గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయడానికి మీరు రివర్స్ సెర్చ్ చేయాలనకుంటున్న ఫోటోలను సెలెక్ట్ చేసి దానిమీద రైట్ క్లిక్ చేసి ఇవ్వండి. అప్పుడు మీరు సెర్చ్ గూగుల్ ఫర్ ఇమేజ్ క్లిక్ చేస్తే గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఆ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూపిస్తుంది. అప్పుడు ఆ ఫోటో నకిలీదా..? లేదా అనే విషయం తెలుసుకోవచ్చు.





























