- Telugu News Photo Gallery Technology photos Oppo Launches new smart phone oppo A36 smart phone. Have a look on features and price
Oppo A 36: ఒప్పో నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. ఏ36 ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Oppo A 36: చైనాకు ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో తాజాగా ఏ 36 పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లోకి రానుంది.. ఫోన్ ఫీచర్లు, ధరల వివరాలపై ఓ లుక్కేయండి..
Narender Vaitla | Edited By: Anil kumar poka
Updated on: Jan 12, 2022 | 8:37 AM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో తాజాగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఒప్పోఏ 36 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ జనవరి 14 నుంచి అందుబాటులోకి రానుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ఎస్ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.

ఒప్పో ఏ36లో 6.56 ఇంచెస్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇచ్చారు. హోల్ పంచ్ కటౌట్ ఈ ఫోన్ స్క్రీన్ ప్రత్యేకత.

ఆండ్రాయిడ్ 11 ఆధారితర ఆపరేటింగ్ సిస్టమ్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు.

కెమెరా విషయానికొస్తే ఇందులో 13 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. ఇక ఈ ఫోన్ రూ. 17,389కి త్వరలో భారత్‌లో అందుబాటులోకి రానుంది.





























