ఆల్కహాల్ బ్యాన్.. పెరుగుతోన్న మరో భయంకర వ్యాధి.. 8 మంది మృతి
కరోనా లాక్‌డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా అన్నీ బంద్ అయిపోయాయి. స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, థియేటర్‌లతో పాటు వైన్స్ షాపులను కూడా బంద్ చేశారు. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ కాస్తా.. మద్యం తాగే అలవాటు ఉన్నవారిని బాగా వేధిస్తోంది. మన తెలుగు రాష్ట్రాలతో పాటు.. చాలా రాష్ట్రాల్లోనూ కరోనా లాక్ డౌన్ కారణంగా..

కరోనా లాక్‌డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా అన్నీ బంద్ అయిపోయాయి. స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, థియేటర్‌లతో పాటు వైన్స్ షాపులను కూడా అధికారులు బంద్ చేశారు. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ కాస్తా.. మద్యం తాగే అలవాటు ఉన్నవారిని బాగా వేధిస్తోంది. మన తెలుగు రాష్ట్రాలతో పాటు.. చాలా రాష్ట్రాల్లోనూ కరోనా లాక్ డౌన్ కారణంగా.. బార్లు, మద్యం షాపులూ మూసేయడంతో లిక్కర్ లేక మద్యం ప్రియులు విలవిల్లాడితున్నారు. తాజాగా కేరళలో ఈ మూడు రోజుల్లో 8 మంది చనిపోయారు.
తెలంగాణాలోనూ మద్యం దొరకలేదని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకో వ్యక్తి బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్‌కి యత్నించినా.. కాలు విరిగి బతికి బయటపడ్డాడు. ఇప్పటివరకూ కరోనా వైరస్‌తో పెద్ద సమస్యగా ఉందనుకుంటే.. ఇప్పుడీ ఆల్కహాల్ విత్‌డ్రాయల్ సిండ్రోమ్ సమస్య అధికారులు, డాక్టర్లను వేధిస్తోంది. కేరళలో ఈ వ్యాధి అత్యంత ఎక్కువగా ఉంది. మద్యం లేదనే బాధను తట్టుకోలేక ఆరుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరో వ్యక్తికి హార్ట్ ఎటాక్ వచ్చింది. ఇంకో వ్యక్తి ఆల్కహాల్ లేదనే బాధతో షేవింగ్ లోషన్ తాగేశాడు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం చూడమని కేరళ ఆరోగ్య శాఖ అధికారులు.. డాక్టర్లకు ఆదేశాలిచ్చింది.
దీనిపై స్పందించిన వైద్యులు పలు సూచనలు ఇచ్చారు. ఆల్కహాల్ విత్‌డ్రాయల్ సిండ్రోమ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఎమర్జెన్సీ టైమ్స్‌లో ఇది మందు బాబులకు వస్తూంటుంది. ఇది వచ్చిన వారికి వెంటనే సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇప్పించాలి. నిర్లక్ష్యం చేస్తే ఆత్మహత్య చేసుకునే ప్రమాదముంది. కొంతమందికి కాళ్లూ, చేతులూ వణికిపోతూంటాయి. తీవ్రంగా జబ్బుపడతారు. అలాంటి వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి తగిన చికిత్స అందించడం మంచిదని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
ప్రభుత్వం వద్దంటోంది.. EMI వాడేమో కట్టాలంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు
లాక్‌డౌన్: దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పిన పీఎం మోదీ
పాలపై టీఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్విగ్గీ, బిగ్ బాస్కెట్‌ల ద్వారా..
డేంజరస్ వైరస్: కోలుకున్న తర్వాత కూడా 8 రోజులు శరీరంలోనే
కన్నీటి పర్యంతమైన కమెడియన్.. మిమ్మల్ని వేడుకుంటున్నా..
మందు బాబులకు గుడ్‌న్యూస్.. అంతలోనే బ్యాడ్‌న్యూస్
ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త.. ముహుర్తం ఫిక్స్..
కరోనాకు తోడు ఎయిడ్స్.. కంపెనీ క్లోజ్
ఫ్లాష్‌న్యూస్: కరోనాకు మందు లేదు.. 18 నెలలు ఆగాల్సిందే: WHO క్లారిటీ