కరోనాకు తోడు ఎయిడ్స్.. కంపెనీ క్లోజ్

ప్రపంచ మార్కెట్లో అతి పెద్ద ఐదు కండోమ్స్‌ కంపెనీల్లో... ఆ కంపెనీ ఒకటి. అలాంటి కంపెనీకి కూడా కరోనా సెగ సోకింది. ప్రపంచంలోనే అతిపెద్ద కండోమ్స్ తయారీ కంపెనీ అయిన కేరెక్స్ బీహెచ్డీ తాత్కాలికంగా మూతపడింది. దీంతో పది రోజుల నుంచి ఆ కంపెనీ తయారీని..

కరోనాకు తోడు ఎయిడ్స్.. కంపెనీ క్లోజ్
Follow us

| Edited By:

Updated on: Mar 28, 2020 | 6:17 PM

ప్రపంచ మార్కెట్లో అతి పెద్ద ఐదు కండోమ్స్‌ కంపెనీల్లో… ఆ కంపెనీ ఒకటి. అలాంటి కంపెనీకి కూడా కరోనా సెగ సోకింది. ప్రపంచంలోనే అతిపెద్ద కండోమ్స్ తయారీ కంపెనీ అయిన కేరెక్స్ బీహెచ్డీ తాత్కాలికంగా మూతపడింది. దీంతో పది రోజుల నుంచి ఆ కంపెనీ తయారీని ఆపివేసింది. మలేషియాకు చెందిన కేరెక్స్‌కు మూడు ఫ్యాక్టరీలు ఉన్నాయి. కరోనా వల్ల వాటిలో ఉత్పత్తి ఆగిపోయింది. దీంతో దేశంతో పాటు విదేశాల్లోనూ కండోమ్స్ కొరత ఏర్పండింది. కరోనా ఉధృతి ఇలాగే కొనసాగితే కండోమ్స్ దొరక్క ఎయిడ్స్, సుఖవ్యాధులు పెచ్చరిల్లే ప్రమాదముందని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా వల్ల.. ఈ పది రోజుల్లో కోట్ల కండోమ్స్‌కు కొరత ఏర్పడిందట. కాగా ఇలాగే గనుక కొనసాగితే.. తర్వాత జరిగే పరిణామాలను ఊహించలేమని.. కేరెక్స్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ గోహ్ మియా కియాత్ అన్నారు.

అయితే మరో పక్క.. కరోనా వల్ల ఇంటికే పరిమితమైన ప్రజలు, అందులోనూ కొత్తగా పెళ్లైన వారు వీటిని అధికంగా కొనుగోలు చేస్తున్నట్లు.. అధికారిక ప్రకటనలే వెలువడ్డాయి. దీన్ని బట్టి కండోమ్స్ వినియోగం ఎంతలా ఉందనేది అర్థమవుతోంది. మరి ఈ సమయంలో షార్టేజీ వస్తే ఏం జరుగుతుందో. కాగా.. మలేషియాలో 2,200లకు పైగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా.. 26 మంది మరణించారు.

ఇవి కూడా చదవండి: 

ఫ్లాష్‌న్యూస్: కరోనాకు మందు లేదు.. 18 నెలలు ఆగాల్సిందే: WHO క్లారిటీ

కరోనా అలెర్ట్: రోడ్లు శుభ్రం చేసిన వైసీపీ ఎమ్మెల్యే

పవన్‌పై మంచు హీరో షాకింగ్ కామెంట్స్

కోలుకున్న కోడి ధరలు.. లాక్‌డౌన్ ఉన్నా రేట్లు పైపైకి

కరోనా ఎఫెక్ట్.. డంపింగ్ యార్డులో గుట్టలు గుట్టులుగా టమాటాలు..

కరోనా ఎఫెక్ట్: తన వల్ల ఊరికి ఏమీ కాకూడదని వృద్ధుడు ఆత్మహత్య

జబర్దస్త్‌లో కరోనా కలకలం.. ఇబ్బందుల్లో ఆర్టిస్టులు

వైరల్ న్యూస్: కరోనా ఉంది నాన్నా.. బయటకెళ్లొద్దంటూ.. బుడ్డోడి ఆవేదన