200కిపైగా సంతానానికి ఏక కాలంలో తండ్రైన నల్లజాతి బానిస..
April 08, 2024
TV9 Telugu
ఆజానుబాహుడు.. ఏడు అడుగులకుపైగా పొడవైన దేహం, నల్లని శరీరఛాయ.. కండలు తిరిగిన దేహం కలిగిన ఓ నల్లజాతీయుడు ఆడవారికి కలల రాకుమారుడిగా అవతరించాడు
కానీ అతడు రాజకుమారుడు కాదు బ్రెజిల్‌కు చెందిన నల్లజాతి బానిస. అతడే పటాసెకా. 19వ శతాబ్దంలో బ్రెజిల్‌లో బానిస వ్యాపారం విపరీతంగా జరిగే రోజులవి
మానవత్వానికి మాయని మచ్చగా మిగిలిన ఈ వ్యాపారంలో సాటి మనుషులన్న దయ లేకుండా నల్లజాతీ వారిని కొనుగోలు చేసి తమ ఇళ్లల్లో పనులకు వినియోగించేవారు
అలా తీసుకొచ్చిన బానిసల్లో పటాసెకా శరీర దారుఢ్యానికి ఆశ్చర్యపోయిన అనేకమంది బానిసల యజమానులకు ఓ వింతైన ఆలోచన తట్టింది. అతని శరీరసౌష్ఠవం, బలమే అతనికి శాపంగా మారింది
అంతే అక్కడున్న నల్లజాతి యువతులతో అతనికి బలవంతంగా సంపర్కం చేయించేవారు. అలా వారికి జన్మించే బిడ్డలు బలంగా పుట్టడంతో పాటు అన్ని పనులు చేస్తారని యజమానులు భావించేవారు
దీంతో పటా సెకాకు కేవలం పిల్లలు కనే బాధ్యతలు మాత్రమే అప్పగించారు. ఇలా అతని వల్ల దాదాపు 200 మందికిపైగా సంతానం కలిగినట్లు అప్పటి లెక్కలు చెబుతున్నాయి
అయితే అతని ద్వారా పుట్టిన బిడ్డలకు 11 ఏళ్లు రాకముందే యజమానులు కష్టమైన పనులను పురమాయించేవారు. పటా సెకా జన్యు లక్షణాలతో బలమైన శ్రామిక శక్తిని ఉత్పత్తి చేయడానికి సంతానోత్పత్తి బానిసగా మార్చారు
1888లో బ్రెజిల్‌లో బానిసత్వం రద్దుకావడంతో పటా సెకా స్వేచ్ఛ లభించింది. అనంతరం పల్మైరా అనే మహిళను వివాహం చేసుకొని తొమ్మిదిమంది బిడ్డలకు తండ్రయ్యాడు. అతడు దాదాపు 130 ఏళ్లు జీవించి 1958లో కన్నుమూశాడు