కరోనా ఎఫెక్ట్.. డంపింగ్ యార్డులో గుట్టలు గుట్టులుగా టమాటాలు..

చిత్తూరు జిల్లా టమాటా రైతులపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లాలో సాగు చేసిన పంటలను అమ్ముకునే అవకాశం లేక తీవ్రంగా నష్టపోతున్నారు రైతులు. మార్కెట్‌కు ట్రేడర్‌లు రాక, ఎగుమతులు లేక రైతులు..

కరోనా ఎఫెక్ట్.. డంపింగ్ యార్డులో గుట్టలు గుట్టులుగా టమాటాలు..
Follow us

| Edited By:

Updated on: Mar 28, 2020 | 1:56 PM

చిత్తూరు జిల్లా టమాటా రైతులపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లాలో సాగు చేసిన పంటలను అమ్ముకునే అవకాశం లేక తీవ్రంగా నష్టపోతున్నారు రైతులు. మార్కెట్‌కు ట్రేడర్‌లు రాక, ఎగుమతులు లేక రైతులు.. టన్నుల కొద్దీ టమోటాలను డంపింగ్ యార్డ్‌లో పడేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా చేతికొచ్చిన దోసకాయలు, కర్భుజా లాంటి పంటలను పొలాల్లోనే వదిలేస్తున్నారు రైతులు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలోని పీలేరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో కూరగాయలు, పండ్లు సాగుచేసిన రైతులు కరోనా దెబ్బకు విలవిల్లాడిపోతున్నారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్‌తో వాహనాలు తిరగకూడదనే నిబంధన వల్లే నష్ట పోతున్నామని వారు వాపోతున్నారు. వ్యవసాయ మార్కెట్‌ల నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

కాగా.. టొమాటోలని డంపింగ్ యార్డులో గుట్టలు గుట్టలుగా పారబోసిన ఘటనపై స్పందించింది జిల్లా యంత్రాంగం. పంటలు మార్కెటింగ్‌కు ఆంక్షలు లేవని కలెక్టర్ స్పష్టం చేశారు. కూరగాయల తరలింపు వాహనాలకు రూట్ మ్యాప్ సిద్ధం చేసి.. వాటికి అనుమతిచ్చారు. ఇవాళ అన్ని టొమాటో లారీలు చెన్నైకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

ఇవి కూడా చదవండి: 

కరోనా ఎఫెక్ట్: తన వల్ల ఊరికి ఏమీ కాకూడదని వృద్ధుడు ఆత్మహత్య

రైతులకు ఊరట.. లాక్‌డౌన్ వర్తించదు..

తిండి లేక గడ్డి తింటోన్న చిన్నారులు..

జబర్దస్త్‌లో కరోనా కలకలం.. ఇబ్బందుల్లో ఆర్టిస్టులు

వైరల్ న్యూస్: కరోనా ఉంది నాన్నా.. బయటకెళ్లొద్దంటూ.. బుడ్డోడి ఆవేదన

ఏప్రిల్ 15 తరువాత కూడా లాక్‌డౌన్ కంటిన్యూ?

కరోనా ఎఫెక్ట్: పెరిగిన కండోమ్స్, ఐపిల్స్ సేల్స్