Lifestyle: మీ కుటుంబలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందా.? మీకు రావొద్దంటే..
ఇదిలా ఉంటే గుండె ఆరోగ్యంగా ఉండడానికి పరిశోధకులు ఎన్నో సూచనలు సూచిస్తున్నారు. భారతీయుల్లో ఎక్కువగా గుండెపోటు రావడానికి ప్రధాన కారణాల్లో శారీరక శ్రమ లేకపోవడమే కారణమని నిపునులు చెబుతున్నారు. ఇక భవిష్యత్తుల్లో గుండెపోటు రాకుండా ఉండాలంటే జీవన విధానంలో కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగానే...
మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు కారణం ఏదైనా ఇటీవల గుండెపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా కరోనా తర్వాత గుండె జబ్బుల బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అప్పటి వరకు ఎంతో ఉషారుగా ఉన్న వారు కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. పాతికేళ్లు కూడా నిండని వారు గుండెపోటుతో మరణించడం అందరినీ విస్మయానికి గురి చేసింది.
ఇదిలా ఉంటే గుండె ఆరోగ్యంగా ఉండడానికి పరిశోధకులు ఎన్నో సూచనలు సూచిస్తున్నారు. భారతీయుల్లో ఎక్కువగా గుండెపోటు రావడానికి ప్రధాన కారణాల్లో శారీరక శ్రమ లేకపోవడమే కారణమని నిపునులు చెబుతున్నారు. ఇక భవిష్యత్తుల్లో గుండెపోటు రాకుండా ఉండాలంటే జీవన విధానంలో కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగానే చేపలను తీసుకోవడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇదేదో ఆషామాషీగా చెబుతోన్న విషయం కాదు. పరిశోధనలు చేసి మరీ తెలిపారు.
చేపల్లోని కొవ్వు ఆమ్లాలు గుండెజబ్బు నివారణకు తోడ్పడుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూటెట్ చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా సాల్మన్, మాకెరెల్, హెరింగ్, సార్‌డైన్ వంటి చేపల్లో ఈపీఏ, డీహెచ్‌ఏ రకం ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయని ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. వీటిని శరీరం సొంతం తయారు చేసుకోవాలు కాబట్టే తీసుకునే ఆహారం ద్వారా అందించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా గుండె జబ్బు బారిన పడితే వారికి ఇది మరింత ముఖ్యమని పరిశోధకులు చెబుతున్నారు.
ఇందుకోసం పలువురుని పరిగణలోకి తీసుకొని అధ్యయనం చేపట్టారు. రక్తంలో ఈపీఏ/డీహెచ్‌ఏ మోతాదులు తక్కువగా ఉండటం.. ఈ రెండూ గలవారికి గుండెజబ్బు వచ్చే అవకాశం 40% ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అదే కుటంబ సభ్యుల్లో గుండెపోటు వచ్చిన చరిత్ర ఒక్కటే గలవారికైతే ముప్పు 25 శాతం మాత్రమే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కాబట్టి తరచూ ఆహారంలో చేపలను భాగం చేసుకోవడం ద్వారా గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..