Shruti Haasan: అతడితో ప్రేమకు ఎండ్ కార్డ్.. ప్రియుడికి బ్రేకప్ చెప్పేసిన శ్రుతిహాసన్.. అసలు కారణం అదేనా ?

లండన్‎కు చెందిన ఫోటోగ్రాఫర్‏తో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ.. కొన్నిరోజులకే అతడితో విడిపోయింది. కానీ అందుకు కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఫస్ట్ హార్డ్ బ్రేక్ తర్వాత చాలాకాలం పాటు ఒంటరిగానే ఉండిపోయింది శ్రుతి. అటు సినిమాలకు కూడా దూరంగానే ఉంటూ కొన్నిరోజులు ప్రశాంతమైన జీవితాన్ని గడిపింది. ఇక ఆ తర్వాత క్రాక్ మూవీతో రీఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకెళ్లింది.

Shruti Haasan: అతడితో ప్రేమకు ఎండ్ కార్డ్.. ప్రియుడికి బ్రేకప్ చెప్పేసిన శ్రుతిహాసన్.. అసలు కారణం అదేనా ?
Shruti Haasan, Santanu Haza
Follow us

|

Updated on: Apr 26, 2024 | 7:22 AM

కమల్ హాసన్ తనయ శ్రుతిహాసన్ మల్టీటాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే. సింగర్‎గా సినీరంగ ప్రవేశం చేసి టాప్ హీరోయిన్‏గా క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించింది. కెరీర్ పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్న శ్రుతికి నిజ జీవితంలో మాత్రం ఒడిదుడుకులు తప్పడం లేదనిపిస్తుంది. ముఖ్యంగా ఈ బ్యూటీకి ప్రేమ విషయాలు అంతగా కలిసిరావడం లేదనిపిస్తుంది. ఇప్పటికే లండన్‎కు చెందిన ఫోటోగ్రాఫర్‏తో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ.. కొన్నిరోజులకే అతడితో విడిపోయింది. కానీ అందుకు కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఫస్ట్ హార్డ్ బ్రేక్ తర్వాత చాలాకాలం పాటు ఒంటరిగానే ఉండిపోయింది శ్రుతి. అటు సినిమాలకు కూడా దూరంగానే ఉంటూ కొన్నిరోజులు ప్రశాంతమైన జీవితాన్ని గడిపింది. ఇక ఆ తర్వాత క్రాక్ మూవీతో రీఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకెళ్లింది.

ఇక ఫస్ట్ బ్రేకప్ తర్వాత శ్రుతి శంతను హజారికతో ప్రేమలో పడింది. వీరిద్దరి నాలుగైదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. డేటింగ్, లివ్ ఇన్ రిలేషన్ షిప్ అంటూ ఇద్దరు కలిసే కనిపించారు. ఇన్ స్టాలో రీల్స్ చేస్తూ.. ఈవెంట్లలో కలిసి పాల్గొంటూ ఈ జంట నిత్యం సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేవారు. ఇద్దరు కలిసి చాలాసార్లు ఫన్నీ రీల్స్, డాన్స్ చేసిన వీడియోస్ నెట్టింట షేర్ చేశారు. కానీ కొన్నిరోజులుగా వీరిద్దరి నుంచి ఎలాంటి ఫోటోస్, వీడియోస్ కానీ రావడం లేదు. అలాగే ఇద్దరు కలిసి కనిపించడం లేదు. దీంతో ఇద్దరు విడిపోయారా ? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇద్దరూ ఇన్ స్టాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. దీంతో వీరిద్దరి బ్రేకప్ రూమర్స్‏కు మరింత బలం చేకూరింది.

Shruti Haasan Breakup

Shruti Haasan Breakup

అలాగే తన ఇన్ స్టాలో శంతనుతో కలిసి దిగిన ఫోటోలను శ్రుతి డెలీట్ చేసింది. దీంతో ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందని క్లారిటీ వచ్చింది. కానీ ఈ విషయంపై అటు శంతను, ఇటు శ్రుతి ఇద్దరు స్పందించలేదు. ఇక నిన్న జరిగిన హీరామండి ప్రీమియర్ షోకు శ్రుతి ఒంటరిగానే వెళ్లింది. అలాగే ఇటీవల తన ఇన్ స్టా స్టోరీలో ఆసక్తికరమైన కోట్ రాసుకొచ్చింది శ్రుతి. “ఇది నా గురించి.. అలాగే నా చుట్టు ఉన్న వ్యక్తుల గురించి నేర్చుకున్నాను. మనం మనలాగే ఉండగలిగే లేదా ఉండాల్సిన అన్ని విషయాల కోసం మనం ఎప్పుడూ చింతించకూడదు” అంటూ రాసుకొచ్చింది. దీంతో శ్రుతి ప్రస్తుతం సింగిల్ స్టేటస్ మెయింటైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Santanu Hazarika News

Santanu Hazarika News

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.