05 May 2024
కృతి శెట్టి డేరింగ్ స్టెప్.. ఆ చిత్రాలకు సై అంటోన్న బేబమ్మ..
Rajitha Chanti
Pic credit - Instagram
ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మంగుళూరు బ్యూటీ కృతి శెట్టి.. తొలి చిత్రానికే రూ.100 కోట్లు రాబట్టి భారీ హిట్ అందుకుంది.
ఆ తర్వాత నటించిన రెండు చిత్రాలు కూడా సూపర్ హిట్ కావడంతో ఈబ్యూటీకి తిరుగులేదనుకున్నారు. కానీ ఆ తర్వాత డిజాస్టర్స్ అందుకుంది.
దీంతో తెలుగులో కృతికి ఆఫర్స్ తగ్గిపోయాయి. దీంతో ఇప్పుడు బ్యూటీ కెరీర్ సందీగ్ధంలో పడింది. ప్రస్తుతం తెలుగులో ఒకే మూవీలో నటిస్తుంది.
శర్వానంద్ సరసన మనమే సినిమాలో నటిస్తుంది. ఇక ఈ బ్యూటీకి ఇప్పుడు ఆఫర్స్ రావాలంటే ఖాతాలో సరైన హిట్టు పడాల్సిందే అంటున్నారు.
దీంతో ఇప్పుడు డేరింగ్ స్టెప్ కోసం రెడీ అవుతుంది కృతి. ఇక మీదట రొమాంటిక్ సినిమాలు చేసేందుకు కృతి ఓకే అనేస్తుందని టాక్ వినిపిస్తుంది.
ఇటీవలే ఓ రొమాంటిక్ చిత్రానికి ఓకే చెప్పిందని టాక్ వినిపిస్తుంది. యంగ్ డైరెక్టర్ చెప్పిన కథకు కృతి శెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.
అలాగే ఈ సినిమాలో లిప్ లాక్ సీన్స్ చేసేందుకు కూడా ఓకే చెప్పిందట. గ్లామర్ సైడ్ చిత్రాలు చేస్తే అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉందని భావిస్తుంది.
అందుకే రొమాంటిక్ చిత్రాలకు సైన్ చేసిందని అంటున్నారు. ఇక ఈ సినిమాతో బేబమ్మ కెరీర్ గాడిన పడే అవకాశం ఉందంటున్నారు క్రిటిక్స్.
ఇక్కడ క్లిక్ చేయండి.