ఆ సినిమా చూశాకే అలాంటి పనులు మానేశా: తమన్నా

TV9 Telugu

05 May 2024

ఓవైపు సినిమాలు, మరోవైపు క్రేజీ వెబ్ సిరీస్ లతో ప్రస్తుతం బిజిబిజీగా ఉంటోంది టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.

త్వరలోనే బాక్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది తమన్నా. తమిళంలో అరణ్మనై-4 పేరుతో ఈ హార్రర్ మూవీ తెరకెక్కింది.

ఇందులో తమన్నాతో పాటు మరో అందాల తార రాశీ ఖన్నా ప్రధాన పాత్రలో నటిస్తోంది.  మే3న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.

తాజాగా బాక్ సినిమా ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్ లో ప్రి రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఇందులో రాశీతో పాటు తమన్నా కూడా సందడి చేసింది.

కాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఓ హాలీవుడ్‌ సినిమాను చూశాక వ్యాక్సింగ్‌ (చర్మంపై రోమాలు తొలగించడం) ను పూర్తిగా మానేశానని తెలిపింది తమన్నా భాటియా.

హాలీవుడ్ తెరకెక్కిన హౌజ్‌ ఆఫ్‌ వ్యాక్స్‌ చిత్రంలో వ్యాక్స్‌తోనే పలు రకాలుగా మనుషులను చంపేస్తుంటారు. ఇప్పుడీ సినిమానే తమన్నా ప్రస్తావించింది.

ఓవైపు సినిమాలు, మరోవైపు క్రేజీ వెబ్ సిరీస్ లతో ప్రస్తుతం బిజిబిజీగా ఉంటోంది టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.