AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అల్లూరి జిల్లాలో గిరిజనులు వినూత్న నిరసన.. ఎందుకంటే

అనంతగిరి మండలం మద్రేబు గ్రామం గిరిజనులు అడవుల గుండా గుర్రాలపై ప్రయాణిస్తూ తమ నిరసనను తెలిపారు. ఆదివాసీల కోసం కోట్ల నిధులు ఖర్చు చేసామని లెక్కలు చూపిస్తున్నారు కానీ, అభివృద్ధి పనులు మాత్రం వాస్తవంలో కనిపించడంలేదని ఆరోపించారు.

Andhra Pradesh: అల్లూరి జిల్లాలో గిరిజనులు వినూత్న నిరసన.. ఎందుకంటే
Tribes Protest
Ram Naramaneni
|

Updated on: May 05, 2024 | 5:30 PM

Share

ఎన్ని ప్రభుత్వాలు మారినా అడవి బిడ్డల జీవితాల్లో మార్పు రావడంలేదు. అడవినే నమ్ముకుని బ్రతికే వీరికి కనీస మౌలిక సదుపాయాలు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రికి వెళ్లాలంటూ రహదారి ఉండదు. సమీపంలో వైద్య సదుపాయం ఉండదు.. ఆస్పత్రికి వెళ్లాలంటే వాగులు, వంకలూ దాటాలి. లేదా డోలీకట్టుకొని వెళ్లాలి. ఈ సందర్భంలో ఒక్కోసారి ఎందరో గర్భిణిలు అడవిలోనే ప్రసవించిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో అల్లూరి జిల్లాలోని గిరిజనులు వినూత్న నిరసనకు దిగారు.

అనంతగిరి మండలం మద్రేబు గ్రామం గిరిజనులు అడవుల గుండా గుర్రాలపై ప్రయాణిస్తూ తమ నిరసనను తెలిపారు. ఆదివాసీల కోసం కోట్ల నిధులు ఖర్చు చేసామని లెక్కలు చూపిస్తున్నారు కానీ, అభివృద్ధి పనులు మాత్రం వాస్తవంలో కనిపించడంలేదని ఆరోపించారు. రోడ్డు సౌకర్యం లేక తాము ఎన్నో అవస్థలు పడుతున్నామని, ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ రాతలు మారడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతంలో ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఆయా పార్టీలు, నేతలు సన్నద్ధమవుతున్నారు. మారుమూల గ్రామాలకు సైతం వెళ్లి ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో అల్లూరి జిల్లా గిరిజనులు నిరసనకు దిగారు. తాము ఓటు వెయ్యాలంటే రోడ్లు వెయ్యాలని డిమాండ్‌ చేశారు. ఓటు వేసేందుకు వెళ్లాలంటే 30 కిలోమీటర్లు గుర్రాలపై వెళ్లాల్సి వస్తోందని ఒక్కొక్కరికి రూ.500లు ఖర్చవుతోందని, ఏ ప్రభుత్వాలూ తమను పట్టించుకోవడంలేదని నిరసనకు దిగారు. నెత్తిమీద అడ్డాకులు పెట్టుకుని గుర్రాలపై ప్రయాణిస్తూ నిరసన తెలిపారు. రోడ్లు వేస్తేనే ఓటు వేస్తామని డిమాండ్‌ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…  

Follow Us
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ