కోలుకున్న కోడి ధరలు.. లాక్‌డౌన్ ఉన్నా రేట్లు పైపైకి

చికెన్ తింటే కరోనా వస్తుందని.. సోషల్ మీడియాలో పలు ప్రచారాలు జరిగిన విషయం తెలిసిందే. దీంతో చికెన్, గుడ్డు ధరలు అమాంతం పడిపోయాయి. చికెన్ ధర ఎప్పుడూ లేని తరహాలో.. హోల్‌సేల్‌గా కిలో రూ.20 నుంచి రూ.40లకి పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఫ్రీగా కోళ్లనే ఇచ్చినా..

కోలుకున్న కోడి ధరలు.. లాక్‌డౌన్ ఉన్నా రేట్లు పైపైకి
Follow us

| Edited By:

Updated on: Mar 28, 2020 | 2:40 PM

చికెన్, గుడ్లు తింటే కరోనా వస్తుందని.. సోషల్ మీడియాలో పలు ప్రచారాలు జరిగిన విషయం తెలిసిందే. దీంతో చికెన్, గుడ్డు ధరలు అమాంతం పడిపోయాయి. ఎగ్సేమో కానీ చికెన్ ధరలు మాత్రం ఎప్పుడూ లేని తరహాలో.. హోల్‌సేల్‌గా కిలో రూ.20 నుంచి రూ.40లకి పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఫ్రీగా కోళ్లు ఇచ్చినా.. ఎవరూ తీసుకునే పరిస్థితి లేకపోయింది. మరికొన్ని ప్రాంతాల్లో అయితే వాటిని ప్రాణాలతో ఉన్నప్పుడే పూడ్చి పెట్టిన పరిస్థితి నెలకొంది. ఇక ఈ పరిస్థితిలో పౌల్ట్రీ పరిశ్రమ నష్టాల్లో కూరుకపోయింది. కోట్లలో కష్టాలను చవిచూడాల్సిన వచ్చింది. పలువురు మంత్రులు కూడా చికెన్ ఫెస్టివల్ నిర్వహించి మంత్రులు చెప్పినా ప్రజలు కన్నెత్తి చూడలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. దీనిపై ఉన్న అపోహలను.. ప్రభుత్వం, పలువురు పేర్కొనడంతో కోలుకుంటోంది. గత వారం రూ.80లు పలికిన కిలో చికెన్ ధర.. లాక్‌డౌన్ పరిస్థితిలో కూడా రూ.170లకి పైగా పలుకుతోంది. అయితే దీనికి ప్రధాన కారణం.. కోళ్ల పెంపకం తగ్గడమే అంటున్నారు పౌల్ట్రీ వ్యాపారులు అంటున్నారు.

సప్లై తగ్గడంతో.. చికెన్ ధరలు పెరుగుతోందని, అలాగే గుడ్లకు డిమాండ్ బాగా పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. స్వయం సీఎం కేసీఆరే ప్రెస్‌మీట్‌లో చెప్పడంతో.. ప్రజలు తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చికెన్, గుడ్లు, పాలు, పండ్లు ఆరోగ్యానికి ఎంతో అవసరమని.. అవి తినడం ద్వారా కరోనాను ఎదుర్కునే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. ఆయన వ్యాఖ్యలు కూడా చికెన్, గుడ్ల ధరలు పెరగడానికి దోహదం చేశాయని కూడా చెబుతున్నారు చికెన్ వ్యాపారులు. మొత్తానికి పౌల్ట్రీ పరిశ్రమకి ఇదో శుభవార్తగా చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి: 

కరోనా ఎఫెక్ట్.. డంపింగ్ యార్డులో గుట్టలు గుట్టులుగా టమాటాలు..

కరోనా ఎఫెక్ట్: తన వల్ల ఊరికి ఏమీ కాకూడదని వృద్ధుడు ఆత్మహత్య

రైతులకు ఊరట.. లాక్‌డౌన్ వర్తించదు..

తిండి లేక గడ్డి తింటోన్న చిన్నారులు..

జబర్దస్త్‌లో కరోనా కలకలం.. ఇబ్బందుల్లో ఆర్టిస్టులు

వైరల్ న్యూస్: కరోనా ఉంది నాన్నా.. బయటకెళ్లొద్దంటూ.. బుడ్డోడి ఆవేదన

ఏప్రిల్ 15 తరువాత కూడా లాక్‌డౌన్ కంటిన్యూ?

కరోనా ఎఫెక్ట్: పెరిగిన కండోమ్స్, ఐపిల్స్ సేల్స్