Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Abbas: అబ్బాస్ కొడుకును ఎప్పుడైనా చూశారా.. ? హీరోలాగే ఉన్నాడు.. ఫోటోస్ వైరల్..

హీరో అబ్బాస్. 1996లో ప్రేమదేశం సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఈ చిత్రాన్ని తమిళంలో కాదల్ దేశం పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో హీరోగా అబ్బాస్ పేరు మారుమోగింది. దీంతో అతడికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ కథల ఎంపికలో చేసిన పొరపాట్లు అతడిని నెమ్మదిగా స్టార్ డమ్ నుంచి దూరం చేశాయి.

Actor Abbas: అబ్బాస్ కొడుకును ఎప్పుడైనా చూశారా.. ? హీరోలాగే ఉన్నాడు.. ఫోటోస్ వైరల్..
Abbas
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 26, 2024 | 8:31 AM

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ట్రెండ్ సెట్టర్. యూత్ అంతా ఆ హీరోను తెగ ఫాలో అయ్యేవారు. ముఖ్యంగా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. అప్పట్లో అతడి స్టైల్‏కు అభిమానులు ఎక్కువే. అలాగే దక్షిణాదిలో చాక్లెట్ బాయ్ అంటూ పిలుచుకునేవారు. అతడే హీరో అబ్బాస్. 1996లో ప్రేమదేశం సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఈ చిత్రాన్ని తమిళంలో కాదల్ దేశం పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో హీరోగా అబ్బాస్ పేరు మారుమోగింది. దీంతో అతడికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ కథల ఎంపికలో చేసిన పొరపాట్లు అతడిని నెమ్మదిగా స్టార్ డమ్ నుంచి దూరం చేశాయి. చిన్నప్పటి నుంచి హిందీ, బెంగాలీ సినిమాలు పెరిగిన అబ్బాస్ కు నటనపై ఆసక్తి ఏర్పడింది. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత ప్రేమదేశం సినిమాతో హీరోగా మారి.. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ వంటి భాషల్లో దాదాపు 100 పైగా సినిమాల్లో నటించి మెప్పించారు.

ప్రేమదేశం తర్వాత కొన్నాళ్లకు అబ్బా్స్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. దీంతో నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోవడంతో మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఆ తర్వాత ఫ్యామిలీతో కలిసి న్యూయార్క్ వెళ్లిన అబ్బా్స్ అక్కడ ట్యా్క్సీ డ్రైవర్ గా.. పెట్రోల్ బంకుల్లో వర్క్ చేశాడు. తర్వాత సాఫ్ట్ వేర్ ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్ గానూ పనిచేస్తున్నారు. అబ్బాస్ ఫ్యాషన్ డిజైనర్ ఎరామ్ అలీని 2001లో పెళ్లి చేసుకున్నారు. వీరికి పాప ఎమిరా, బాబు ఐమాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Abbas Family

Abbas Family

తాజాగా అబ్బాస్ ఫ్యామిలీ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో అబ్బాస్ కొడుకు అచ్చం హీరోలా కనిపిస్తున్నాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అబ్బాస్ తన కుమారుడి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. చిన్నప్పుడు తాను ఎంతో సైలెంట్ గా ఉండేవాడినని.. కానీ తన కొడుకు మాత్రం అలా కాదని.. తాను ఎంతో మెచ్యూర్డ్ ఆలోచనలు కలిగిన వ్యక్తి అని అన్నారు. అబ్బాస్ కుమారుడు, కూతురు సోషల్ మీడియాలో దూరంగానే ఉంటారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బంగారం ప్రియులకు భారీ షాక్.. మరింత పెరిగిన ధరలు! తులం ఎంతుందంటే..
బంగారం ప్రియులకు భారీ షాక్.. మరింత పెరిగిన ధరలు! తులం ఎంతుందంటే..
ఉదయాన్నే ఇవి తింటే గుండెపోటుకు చెక్ పెట్టొచ్చు.. ఎలాగంటే..
ఉదయాన్నే ఇవి తింటే గుండెపోటుకు చెక్ పెట్టొచ్చు.. ఎలాగంటే..
రెవెన్యూ శాఖలో 10,954 GPO ఉద్యోగాలకు సర్కార్‌ గ్నీన్‌ సిగ్నల్‌!
రెవెన్యూ శాఖలో 10,954 GPO ఉద్యోగాలకు సర్కార్‌ గ్నీన్‌ సిగ్నల్‌!
ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు
ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు
మీకు పని మీద ఆసక్తి లేదని తెలిపే 7 సంకేతాలివి.. ఇలా మార్చేయండి
మీకు పని మీద ఆసక్తి లేదని తెలిపే 7 సంకేతాలివి.. ఇలా మార్చేయండి
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..