AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ద్రాక్షారామం భీమేశ్వరాలయంలో అపచారం

ద్రాక్షారామం భీమేశ్వరాలయంలో అపచారం

Phani CH
|

Updated on: Jan 01, 2026 | 2:10 PM

Share

ద్రాక్షారామం భీమేశ్వర ఆలయంలో ముక్కోటి ఏకాదశి నాడు శివలింగం ధ్వంసం కలకలం రేపింది. కఫాలేశ్వర ఘట్టంలోని ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వేగంగా దర్యాప్తు చేసి, ఆలయ పూజారితో వివాదం కారణంగా ఒక అనుమానితుడిని అరెస్ట్ చేశారు. అధికారులు శాస్త్రోక్తంగా శివలింగాన్ని పునఃప్రతిష్టించారు. ఈ 1100 ఏళ్ల ఆలయానికి పూర్వ వైభవం వచ్చింది.

అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని ప్రసిద్ధ భీమేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన అపచారం జరిగింది.భీమేశ్వర స్వామి ఆలయంలో అతి పురాతన మైన కఫాలేశ్వర ఘట్టంలోని శివలింగాన్ని ధ్వసం చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. భీమేశ్వర స్వామి ఆలయం వెనుక భాగంలో ఉన్న సప్త గోదావరి నది తీరంలో గల శివలింగాన్ని ధ్వసం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు పోలీసు బృందాలతో దర్యాప్తు వేగవంతం చేశారు. కాగా కఫాలేశ్వరని ఘట్టం వద్ద శివలింగాన్ని ధ్వంసం చేసిన ఘటన సెన్సిటివ్ విషయం కావడం తో పోలీసు, దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు, పురావాస్తు శాఖ అధికారులు తిరిగి శివలింగాన్ని ప్రతిష్టించారు. ముందుగా వేద పండితులు అర్చకులు శాంతి పూజలు నిర్వహించారు. అగంతకులు చర్యలతో శిధిలమైన శివలింగం శకలాలను పూర్తిగా తొలగించి యధావిధిగా పానవట్టంపై ఆగమ శాస్త్ర యుక్తంగా శివలింగాన్ని ప్రతిష్టించారు. శివ లింగాన్ని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలంటూ ద్రాక్షారామ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు విశ్వహిందూ పరిషత్,హిందూ సంఘాల కార్యకర్తలు. ద్రాక్షారామం శివలింగం ధ్వంసం ఘటనపై విచారణలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆలయంలో అర్చకుడిపై కోపంతోనే కపాలేశ్వరస్వామి శివలింగాన్ని అతను ధ్వంసం చేసినట్టు చెప్తున్నారు. పోలీసులు తోటపేటకి చెందిన 38 ఏళ్ల శీలం శ్రీనివాస్‌ని అదుపులోకి తీసుకున్నారు. CC ఫుటేజ్‌ ఆధారంగా మరికొందరినీ విచారించినా తోటపేట యువకుడిని గట్టిగా ప్రశ్నిస్తే నిజం ఒప్పుకున్నట్టు సమాచారం. భీమేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసే విషయంలో ఆ యువకుడికి, పూజారికి మధ్య పలుమార్లు గొడవ జరిగిందని తెలుస్తోంది.పూజారిపై కోపంతోనే శివలింగం ధ్వంసం చేసినట్లు అతను చెప్తున్నాడంటున్నారు. మంగళవారం ఈ విషయం వెలుగుచూడగానే CM చంద్రబాబు కూడా ఆరా తీశారు. జిల్లా SP కూడా వెంటనే దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించారు. డాగ్‌ స్క్వాడ్‌ కూడా రప్పించారు. CC ఫుటేజ్‌లు కూడా పరిశీలించాక కొందర్ని విచారించారు. తర్వాత శ్రీనివాస్‌ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పంచారామాల్లో ఒకటిగా, జ్యోతిర్లింగాలలో ఆఖరిదిగా చెప్పే ఈ ద్రాక్షారామం భీమేశ్వరాలయం చాలా మహిమాన్వితమైన క్షేత్రంగా భక్తులు భావిస్తారు. ఈ ఆలయానికి 11 వందల ఏళ్ల చరిత్ర ఉంది. మంగళవారం దెబ్బతిన్న శివలింగం స్థానంలో కొత్తది పునఃప్రతిష్ఠించారు. దేవాదాయ శాఖ అధికారులు శాస్త్రోక్తంగా పానవట్టంపైన ఉన్న లింగాకారాన్ని ప్రతిష్ఠించి పూజాదికాలు పూర్తి చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఛీ.. ఎంతకు తెగిస్తున్నార్రా.. అప్పన్న ప్రసాదంలో నత్త అంటూ ఫేక్ వీడియో

షమీకి మళ్లీ జట్టులోకి ఛాన్స్ !! గౌతమ్ గంభీర్ కు షాక్

వందే భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్‌

పెళ్లిలోకి సడన్‌ ఎంట్రీ ఇచ్చిన డెలివరీ బాయ్‌.. ఆ తర్వాత