Andhra: బీచ్‌లో జాలీ రైడ్ చేద్దామనుకున్నారు.. అలల్ని తాకుతూ ఎంజాయ్ చేస్తుండగా.. ఆ తర్వాత.!
థార్ కార్‌లో బీచ్ ఒడ్డుకు వెళ్లారు. కాసేపు అలల్ని తాకుతూ డ్రైవింగ్ బాగానే సాగింది. అయితే గోదావరి నది సముద్రంలో కలిసే అన్నాచెల్లెళ్ల గట్టు దగ్గర మలుపు ఉంటుందనే విషయం వీళ్లకు తెలియకపోవడంతో అక్కడకు వచ్చాక కారు నేరుగా నీళ్లలోకి వెళ్లిపోయింది. ఇది గమనించి..

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అంతర్వేది బీచ్ కి వెళ్ళిన ముగ్గురు యువకుల్లో ఓ యువకుడు జీప్‌తో సహా గల్లంతయ్యాడు. పోలీసులు సముద్రంలోంచి కారు బయటకి తీశారు. కారులోనే విగతజీవిగా స్టీరింగ్ పట్టుకుని ఉండిపోయాడు శ్రీధర్. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. శ్రీధర్ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం కాకినాడ నుంచి అంతర్వేది వచ్చిన ముగ్గురు ఫ్రెండ్స్ యాపిల్ రిసార్ట్‌లో రూమ్ తీసుకున్నారు. ఫుల్‌గా పార్టీ ఎంజాయ్ చేశారు. తర్వాత ముగ్గురిలో ఇద్దరు బీచ్‌లో జాలీ రైడ్ కోసం కార్ తీశారు.
థార్ కార్‌లో బీచ్ ఒడ్డుకు వెళ్లారు. కాసేపు అలల్ని తాకుతూ డ్రైవింగ్ బాగానే సాగింది. అయితే గోదావరి నది సముద్రంలో కలిసే అన్నాచెల్లెళ్ల గట్టు దగ్గర మలుపు ఉంటుందనే విషయం వీళ్లకు తెలియకపోవడంతో అక్కడకు వచ్చాక కారు నేరుగా నీళ్లలోకి వెళ్లిపోయింది. ఇది గమనించి ఓ యువకుడు కారులోంచి దూకి బయటపడ్డాడు. మరో యువకుడు గల్లంతయ్యాడు. కారు పూర్తిగా నీళ్లలోకి దిగిపోయిన తర్వాత కూడా కాసేపు లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. ప్రాణాలతో బయటపడ్డ యువకుడు.. తన స్నేహితుడిని కాపాడండి అని కేకలు పెట్టినా ఆ చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో సాయం అందే మార్గమే లేకుండా పోయింది. సముద్రంలోంచి కారు బయటికి తీసిన పోలీసులు… పోస్ట్‌మార్టం కోసం డెడ్‌బాడీని ఆసుపత్రికి తరలించారు.. విషయం తెలిసి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు.




