No Fuel: ఇక ఈ వాహనాలకు పెట్రోల్, డీజిల్ బంద్.. కారణం ఏంటో తెలుసా?
No Fuel: వాహనాల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిబంధనలలో మార్పులు తీసుకువస్తున్నాయి. అలాగే ఇక ఈ వాహనాలకు పెట్రోల్, డీజిల్ వేసుకునేందుకు అనుమతి ఉండదు. అందుకు కారణం ఏంటో తెలుసా..?

కాలుష్యంపై యుద్ధం చేస్తూ ఢిల్లీ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది.ఢిల్లీ శివార్లలోని పెట్రోల్ పంపులు జూలై 1 నుండి ఎంపిక చేసిన వాహనాలకు పెట్రోల్, డీజిల్ సరఫరా ఉండదు. దీనికి దాదాపు అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. క్రమంగా ఈ నిర్ణయం మొత్తం ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో అమలు చేయనుంది. CAQM ఆదేశాల ప్రకారం.. జూలై 1 నుండి ఢిల్లీలో 15 ఏళ్ల పెట్రోల్ వాహనాలకు, 10 ఏళ్ల డీజిల్ వాహనాలకు ఇంధనం విక్రయించరు.
శీతాకాలంలో ఢిల్లీ గాలి నాణ్యత చాలా దారుణంగా మారుతుంది. ఢిల్లీ గాలి నాణ్యత సూచిక 400 పాయింట్లు దాటిపోయింది. దీనికి రెండు అతిపెద్ద కారణాలు చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం, వాహనాల కాలుష్యం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాటల్లో చెప్పాలంటే, దేశంలోని వాయు కాలుష్యంలో 40 శాతం వాహనాల నుండి వెలువడే పొగ వల్లే సంభవిస్తున్నాయి. అందువల్ల, ఢిల్లీకి సంబంధించి ఈ నిర్ణయం శీతాకాలానికి ముందే తీసుకుంది.
నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్‌లలో కూడా నిషేధం:
ఢిల్లీలో పాత పెట్రోల్, డీజిల్ వాహనాలకు ఇంధనం అందించకూడదనే నిర్ణయం జూలై 1 నుండి అమల్లోకి వస్తుంది. అదే సమయంలో ఢిల్లీలోని పరిసర ప్రాంతాల నుండి వచ్చే వాహనాల నుండి కాలుష్యాన్ని నివారించడానికి ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా), గురుగ్రామ్, సోనిపట్‌లలో కూడా ఇలాంటి నిర్ణయం అమలు చేస్తుంది. ఈ నగరాల్లో నవంబర్ 1 నుండి పాత పెట్రోల్-డీజిల్ వాహనాలకు ఇంధనం వేయరు.
దీనితో పాటు ఈ నిర్ణయం NCR పరిధిలోకి వచ్చే మీరట్, ఫరీదాబాద్, రోహ్తక్, భివానీ, రేవారీ, అల్వార్ వంటి నగరాల్లో కూడా అమలు కానుంది. ఇక్కడ 10 సంవత్సరాల పాత డీజిల్ వాహనాలకు 15 సంవత్సరాల పాత పెట్రోల్ వాహనాలకు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 తర్వాత పెట్రోల్, డీజిల్ వేసుకోలేరు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
