May 2025 Bank Holidays: బిగ్ అలర్ట్.. మేలో బ్యాంక్‌లకు భారీగా సెలవులు.. ఎన్ని రోజులో తెలుసా?
ఏప్రిల్ నెల ముంగింపు దశకు చేరుకుంది. కాబట్టి రాబోయే నెలలో బ్యాంక్ సెలవుల జాబితా కోసం ఖాతాదారులు, వ్యాపారస్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మే 2025 నెలలో బ్యాంకు సెలవుల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం సెలవులు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి..

భారీగా వ్యాపారం ఉన్న వారు ఎక్కువగా బ్యాంకుల్లో లావాదేవీలు సాగిస్తుంటారు. తరచూ బ్యాంకులకు వెళ్తుంటారు. అలాంటి సమయాల్లో బ్యాంక్‌లకు సెలవులు ఉంటే తాము జరపాల్సిన లావాదేవీల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే బ్యాంక్‌ల సెలవుల సమాచారాన్ని ముందుగానే తెలుసుకుంటారు. అయితే ఇప్పుడు ఏప్రిల్ నెల ముగుస్తుండటంతో, రాబోయే మే నెలకు సంబంధించిన బ్యాంకు సెలవులకు సంబంధించి ఆర్బీఐ విడుదల చేసే సెలవుల జాబితా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మే 2025 నెలలో బ్యాంకు సెలవుల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం, వచ్చే నెలలో వారాంతపు సెలవులైన శని, ఆదివారాలతో కలిసి మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.
తాజాగా ఆర్బీఐ విడుదల చేసిన జాబితా ప్రకారం బ్యాంక్‌ల సెలవులు ఇలా ఉన్నాయి..
- మే 1 (గురువారం): కార్మిక దినోత్సవం / మహారాష్ట్ర దినోత్సవం
- మే 4 (ఆదివారం): వారాంతపు సెలవు
- మే 9 (శుక్రవారం): రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి
- మే 10 (శనివారం): రెండవ శనివారం
- మే 11 (ఆదివారం): వారాంతపు సెలవు
- మే 12 (సోమవారం): బుద్ధ పూర్ణిమ
- మే 16 (శుక్రవారం): సిక్కిం స్టేట్ డే (ప్రాంతీయ సెలవు)
- మే 18 (ఆదివారం): వారాంతపు సెలవు
- మే 24 (శనివారం): నాల్గవ శనివారం
- మే 25 (ఆదివారం): వారాంతపు సెలవు
- మే 26 (సోమవారం): కాజీ నజ్రుల్ ఇస్లాం పుట్టినరోజు (ప్రాంతీయ సెలవు)
- మే 29 (గురువారం): మహారాణా ప్రతాప్ జయంతి
అయితే బ్యాంక్‌లలో లావాదేవీలు జరిపేవారు ఈ సెలవులను దృష్టిలో పెట్టుకొని తమ పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే సెలవు దినాల్లో బ్యాంకు బ్రాంచ్‌లు మూసి ఉండటంతో కౌంటర్ సేవలు అందుబాటులో ఉండవు. కానీ ఈ సెలవు దినాల్లో ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎం సేవలు వంటి డిజిటల్ లావాదేవీలకు ఎటువంటి అంతరాయం ఉండదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
- గమనిక: బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్‌లో మార్పులు కూడా రావచ్చు.. కావున హాలిడే క్యాలెండర్ అప్‌డేట్ సమాచారం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




