ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త.. ముహుర్తం ఫిక్స్..

చరణ్ ఎంట్రీ అయిపోవడంతో ఇక ఎన్టీఆర్ వంతు వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి కూడా ఎంతో సమయం లేదు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే. చరణ్ పరిచయానికి సూపర్ రెస్పాన్స్ అందుకున్న తరుణంలో..

ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త.. ముహుర్తం ఫిక్స్..
Follow us

| Edited By:

Updated on: Mar 29, 2020 | 8:14 AM

డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో.. పిరియాడికల్, యాక్షన్ యాంగిల్‌లో ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) రూపొందుతోన్న విషయం తెలిసిందే. చారిత్రక వీరులైన కొమురం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రల్లో.. జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తోన్నారు. ఈ మధ్యే ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించింది చిత్ర బృందం. అలాగే తాజాగా చెర్రీ బర్త్ డే సందర్భంగా.. సీతారామ రాజుగా చరణ్ ఇంట్రడక్షన్ సూపర్ రెస్పాన్స్ అందుకోంది. అలాగే వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో ఎంతో గంభీరంగా ఎన్టీఆర్ వాయిస్‌ అదిరిపోయిందనే చెప్పాలి. చరణ్ పాత్రను ఆయన పరిచయం చేసిన తీరు ఫ్యాన్స్‌తో పాటు సగటు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించింది.

చరణ్ ఎంట్రీ అయిపోవడంతో ఇక ఎన్టీఆర్ వంతు వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి కూడా ఎంతో సమయం లేదు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే. చరణ్ పరిచయానికి సూపర్ రెస్పాన్స్ అందుకున్న తరుణంలో అంతకు మించిన స్థాయిలో ఎన్టీఆర్ వీడియో ఉండాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. అలాగే అభిమానుల ఆసక్తికి తగ్గట్లుగానే ఎన్టీఆర్ ఎంట్రీ ఏ మాత్రం తగ్గకుండా.. కొమరం భీమ్‌ని ఓ సునామీలా చూపించనున్నారని టాక్. కాగా.. ఈ చిత్రంలో హీరోయిన్లు ఒలివియా మోరిస్, అలియా భట్‌లు నటిస్తున్నారు. ఈ సినిమా 2021లో జనవరి 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విడుదల కానుంది. ఇప్పుడు ఈ కరోనా వైరస్ కారణంగా.. పూణె షెడ్యూల్ వాయిదా పడింది. కరోనా కాస్త తగ్గుముఖం పడితే.. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది.

ఇవి కూడా చదవండి: కరోనాకు తోడు ఎయిడ్స్.. కంపెనీ క్లోజ్

ఫ్లాష్‌న్యూస్: కరోనాకు మందు లేదు.. 18 నెలలు ఆగాల్సిందే: WHO క్లారిటీ

కరోనా అలెర్ట్: రోడ్లు శుభ్రం చేసిన వైసీపీ ఎమ్మెల్యే

పవన్‌పై మంచు హీరో షాకింగ్ కామెంట్స్

కోలుకున్న కోడి ధరలు.. లాక్‌డౌన్ ఉన్నా రేట్లు పైపైకి

కరోనా ఎఫెక్ట్.. డంపింగ్ యార్డులో గుట్టలు గుట్టులుగా టమాటాలు..

కరోనా ఎఫెక్ట్: తన వల్ల ఊరికి ఏమీ కాకూడదని వృద్ధుడు ఆత్మహత్య

జబర్దస్త్‌లో కరోనా కలకలం.. ఇబ్బందుల్లో ఆర్టిస్టులు

వైరల్ న్యూస్: కరోనా ఉంది నాన్నా.. బయటకెళ్లొద్దంటూ.. బుడ్డోడి ఆవేదన