డేంజరస్ వైరస్: కోలుకున్న తర్వాత కూడా 8 రోజులు శరీరంలోనే
కరోనా చికిత్స పొంది పూర్తిగా కోలుకున్న తర్వాత కూడా దాదాపు 8 రోజుల దాకా వైరస్ రోగి శరీరంలోనే ఉండే అవకాశాలున్నాయని చైనా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 9వ తేదీ మధ్యకాలంలో బీజింగ్‌లోని పీఎల్‌ఏ జనరల్ ఆస్పత్రిల్లో కోవిడ్-19 చికిత్స పొంది కోలుకున్న..

కరోనా చికిత్స పొంది పూర్తిగా కోలుకున్న తర్వాత కూడా దాదాపు 8 రోజుల దాకా వైరస్ రోగి శరీరంలోనే ఉండే అవకాశాలున్నాయని చైనా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 9వ తేదీ మధ్యకాలంలో బీజింగ్‌లోని పీఎల్‌ఏ జనరల్ ఆస్పత్రిల్లో కోవిడ్-19 చికిత్స పొంది కోలుకున్న వ్యక్తులు ఇళ్లకు వెళ్లిన 16 మంది రోగుల ఆరోగ్యాల్లో వచ్చిన మార్పులను చెక్ చేయడంతో ఈ విషయం వెల్లడైందని వారు తెలిపారు. రోగుల ఇళ్లకు వెళ్లిన శాస్త్రవేత్తలు ఒకరోజు తప్పించి.. మరొక రోజు గొంతులోని స్రావాల శాంపిళ్లను సేకరించి పరీక్షలు జరిపారు. దీంతో వారిలో సగం మంది శ్వాసకోశ వ్యవస్థలో ఇప్పటికీ కరోనా వైరస్ జాడ ఉన్నట్లు వెల్లడైంది. దీంతో ఈ క్రమంలో ఎవరినైనా కలిస్తే సులువుగా వైరస్ సక్రమించే ముప్పు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి చికిత్స తీసుకున్న తరువాత కూడా ప్రజలకు ఓ నెల రోజుల పాటు దూరంగా ఉండటం మంచిదని అంటున్నారు. అలాగే కుటుంబసభ్యులు కూడా రోగి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. వైరస్ సోకిన వ్యక్తిని ప్రత్యేక గదిలో ఉంచాలన్నారు. కాగా ఈ అధ్యయనంలో భారత సంతతి శాస్త్రవేత్త లోకేష్ శర్మ కూడా భాగస్తులయ్యారు.
ఇవి కూడా చదవండి: కన్నీటి పర్యంతమైన కమెడియన్.. మిమ్మల్ని వేడుకుంటున్నా..
మందు బాబులకు గుడ్‌న్యూస్.. అంతలోనే బ్యాడ్‌న్యూస్
ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త.. ముహుర్తం ఫిక్స్..
కరోనాకు తోడు ఎయిడ్స్.. కంపెనీ క్లోజ్
ఫ్లాష్‌న్యూస్: కరోనాకు మందు లేదు.. 18 నెలలు ఆగాల్సిందే: WHO క్లారిటీ
కరోనా అలెర్ట్: రోడ్లు శుభ్రం చేసిన వైసీపీ ఎమ్మెల్యే
పవన్‌పై మంచు హీరో షాకింగ్ కామెంట్స్
కోలుకున్న కోడి ధరలు.. లాక్‌డౌన్ ఉన్నా రేట్లు పైపైకి
జబర్దస్త్‌లో కరోనా కలకలం.. ఇబ్బందుల్లో ఆర్టిస్టులు
వైరల్ న్యూస్: కరోనా ఉంది నాన్నా.. బయటకెళ్లొద్దంటూ.. బుడ్డోడి ఆవేదన