Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 51 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 151767 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 83004 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 64426 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4337 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
  • అమరావతి: ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ. ఎమెర్జెన్సీ పనులు నిమిత్తం తమను కంపెనీలోకి అనుమతించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఎల్జీ పాలిమర్స్. రోజు వారీ కార్యకలాపాల కోసం కంపెనీలోనికి వెళ్లేందుకు సుప్రీంకోర్టు 30 మందికి అనుమతి. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి పత్రం ఇవ్వలేదన్న కంపెనీ తరుపు న్యాయవాది.
  • ఈ రోజు ఒకరికి CRPF జవాన్ కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన వైద్యులు. దేశ వ్యాప్తంగా మొత్తం 369 CRPF సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరణ 141 యాక్టీవ్ కేస్ లు. 226 మంది డిశ్చార్జ్. ఇద్దరు మృతి.
  • ఢిల్లీ: తబ్లిఘి జమాత్ కేసుకు సంబంధించి 294 మంది విదేశీయుల పై 15 చార్జిషీట్లను సాకేత్ కోర్టులో దాఖలు చేయనున్న ఢిల్లీ పోలీసులు.
  • ఢిల్లీ: ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారావనే అధ్యక్షత ప్రారంభమైన ఆర్మీ కమాండర్ల సమావేశం. ఆర్మీ ఫోర్స్ టాప్ కమాండర్లు ఈ సమావేశానికి హాజరు. లడఖ్లో చైనా దురాక్రమణతో సహా అన్ని భద్రతా సమస్యల పై చర్చ.
  • భారత్-చైనా సరిహద్దులకు రిజర్వు బలగాల మొహరింపు. రక్షణ దళాల అధిపతి బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతో సమావేశమైన ప్రధాని, రక్షణశాఖ మంత్రి. సరిహద్దుల్లో రోడ్లు, ఇతర నిర్మాణ పనులు ఆపొద్దని ఆదేశం. సరిహద్దుల్లో రోడ్డు నిర్మాణంపై అభ్యంతరం చెబుతున్న చైనా. మరోవైపు చైనాలో విస్తృతంగా రోడ్లు, ఎయిర్‌బేస్ ల నిర్మాణం. నేడు కోర్ కమాండర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఆర్మీ సమావేశం.

మందు బాబులకు గుడ్‌న్యూస్.. అంతలోనే బ్యాడ్‌న్యూస్

కరోనా ఎఫెక్ట్‌తో మందుబాబులకు ముద్ద దిగట్లేదంటే.. విచిత్రం కాదు. చుక్క పడనిదే.. నిద్ర కూడా పోరు. అలాంటి వాళ్లకి ఈ లాక్‌డౌన్ కారణంగా.. ఏం తోచడం లేదు. కొంతమందైతే పిచ్చెక్కిపోతున్నారు. మరికొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో.. ఈ మధ్య వాట్సాప్‌లో ఓ మెసేజ్‌ జోరుగా..
Good news for drinkers bad news soon to follow, మందు బాబులకు గుడ్‌న్యూస్.. అంతలోనే బ్యాడ్‌న్యూస్

కరోనా ఎఫెక్ట్‌తో మందుబాబులకు ముద్ద దిగట్లేదంటే.. విచిత్రం కాదు. చుక్క పడనిదే.. నిద్ర కూడా పోరు. అలాంటి వాళ్లకి ఈ లాక్‌డౌన్ కారణంగా.. ఏం తోచడం లేదు. కొంతమందైతే పిచ్చెక్కిపోతున్నారు. మరికొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో.. ఈ మధ్య వాట్సాప్‌లో ఓ మెసేజ్‌ జోరుగా వైరల్ అయ్యింది. దీంతో మందుబాబుల ప్రాణం లేచి వచ్చింది. వెంటనే బార్లు, వైన్ల షాపుల ముందు క్యూ కట్టారు. రేపట్నుంచి ఎంచక్కా  ఓ పెగ్గేసి ఇంట్లోనే పడుకోవచ్చనుకున్నారు.

తెలంగాణ సర్కార్ లోగోతో అచ్చం ఆబ్కారీ శాఖ విడుదల చేసినట్లుగా ఉన్న ఫొటో చూసినవారంతా నిజమే అనుకున్నారు. నిజానికి లిక్కర్ రూపంలోనే సర్కార్‌కు ఆదాయం వస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అందుకోసమే వైన్స్ ఓపెన్ చేస్తారేమో అనుకున్నారట. అందులోనూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ.. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5-30 గంటల వరకే తెరిచి ఉంటాయని ఉండటంతో అంతా నిజమే అనుకున్నారు.

కానీ కట్ చేస్తే.. అది ఫేక్ మెసేజ్ అని, అవాస్తవమని తేలింది. ఈ విషయానికి సంబంధించి స్వయంగా ఆబ్కారీ శాఖనే తెలపడంతో.. మందు బాబులకు ఒక్కసారిగా తాగిందంతా దిగిపోయినట్లయ్యిందట. వెంటనే ఇది ఫేక్ ఉత్తర్వులు అని ఫొటో చక్కర్లు కొట్టడంతో అంతా అయోమయానికి గురయ్యారు. మద్యం దుకాణాలు తెరుస్తారని నకిలీ ఉత్తర్వులు కొందరు వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమైంది ఆబ్కారీ శాఖ. దీంతో మద్యం ప్రియులకు వైన్స్ తెరిచే న్యూస్ కాసేపటికే చేధుగా మారిపోయిందని వాట్సాప్ గ్రపుల్లో సెటైర్లు వేసుకుంటున్నారట. ఓ వైపు ఫేక్ న్యూస్‌లు స్ప్రెడ్ చేయొద్దని ఎంత చెబుతున్నా కూడా.. కొంతమంది ఆకతీయులు చివరకి ప్రభుత్వాన్ని కూడా ఆటపట్టిస్తున్నారని పలువురు సీరియస్ అవుతున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి: 

న్టీఆర్ అభిమానులకు శుభవార్త.. ముహుర్తం ఫిక్స్..

కరోనాకు తోడు ఎయిడ్స్.. కంపెనీ క్లోజ్

ఫ్లాష్‌న్యూస్: కరోనాకు మందు లేదు.. 18 నెలలు ఆగాల్సిందే: WHO క్లారిటీ

కరోనా అలెర్ట్: రోడ్లు శుభ్రం చేసిన వైసీపీ ఎమ్మెల్యే

పవన్‌పై మంచు హీరో షాకింగ్ కామెంట్స్

కోలుకున్న కోడి ధరలు.. లాక్‌డౌన్ ఉన్నా రేట్లు పైపైకి

జబర్దస్త్‌లో కరోనా కలకలం.. ఇబ్బందుల్లో ఆర్టిస్టులు

వైరల్ న్యూస్: కరోనా ఉంది నాన్నా.. బయటకెళ్లొద్దంటూ.. బుడ్డోడి ఆవేదన

Good news for drinkers bad news soon to follow, మందు బాబులకు గుడ్‌న్యూస్.. అంతలోనే బ్యాడ్‌న్యూస్

Good news for drinkers bad news soon to follow, మందు బాబులకు గుడ్‌న్యూస్.. అంతలోనే బ్యాడ్‌న్యూస్

Related Tags