కన్నీటి పర్యంతమైన కమెడియన్.. మిమ్మల్ని వేడుకుంటున్నా..
కమెడియన్ వడివేలు ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదంటున్నారు. కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకూ ఉధృత రూపం దాల్చుతోంది. దీని దెబ్బకి ప్రపంచంలోని చాలా దేశాలు లాక్‌డౌన్‌లో..

కమెడియన్ వడివేలు ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదంటున్నారు. కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకూ ఉధృత రూపం దాల్చుతోంది. దీని దెబ్బకి ప్రపంచంలోని చాలా దేశాలు లాక్‌డౌన్‌లో ఉన్నాయి. ఇక రాష్ట్రాల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మందు కనిపెట్టని ఈ మహమ్మారిని ఎలా ఎదుర్కొవాలా? అని ప్రభుత్వాలన్నీ తర్జనభర్జన పడుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వాలు చెబుతున్న సలహాలు పాటించడం తప్ప చేసేదేమీ లేదు.
ఈ సందర్భంగా కమెడియన్ వడివేలు ఓ వీడియోలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకుని మరీ ప్రజలను వేడుకున్నారు. ‘ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఏనాడూ ఊహించలేదన్నారు. చాలా మనోవేదనకు గురవుతున్నా. దయచేసి రోడ్ల మీద తిరగకండి. ఇక డాక్టర్లు, నర్సులు వారి ప్రాణాలను పణంగా పెట్టి ఈ మహమ్మారిపై పోరాటం చేస్తున్నారు. మనల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పోలీసులు కూడా చాలా చోట్ల చేతులు జోడించి వేడుకోవడం చూశాను. దయచేసి మన కోసం, మన వారందరూ కష్టపడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాలు చెప్పింది విని, ఇంటిపట్టునే ఉండండి. పోలీసులు, అధికారుల సూచనలని ఎవరూ తేలికగా తీసుకోవద్దు. ఎవరూ బయటికి రావద్దు.. మిమ్మల్ని వేడుకుంటున్నా’.. అని చెబుతూ వడివేలు కన్నీటి పర్యంతమయ్యారు.
ఇవి కూడా చదవండి: మందు బాబులకు గుడ్‌న్యూస్.. అంతలోనే బ్యాడ్‌న్యూస్
ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త.. ముహుర్తం ఫిక్స్..
కరోనాకు తోడు ఎయిడ్స్.. కంపెనీ క్లోజ్
ఫ్లాష్‌న్యూస్: కరోనాకు మందు లేదు.. 18 నెలలు ఆగాల్సిందే: WHO క్లారిటీ
Read More also this: కరోనా అలెర్ట్: రోడ్లు శుభ్రం చేసిన వైసీపీ ఎమ్మెల్యే
పవన్‌పై మంచు హీరో షాకింగ్ కామెంట్స్
కోలుకున్న కోడి ధరలు.. లాక్‌డౌన్ ఉన్నా రేట్లు పైపైకి
జబర్దస్త్‌లో కరోనా కలకలం.. ఇబ్బందుల్లో ఆర్టిస్టులు
వైరల్ న్యూస్: కరోనా ఉంది నాన్నా.. బయటకెళ్లొద్దంటూ.. బుడ్డోడి ఆవేదన