కోట్లు ఇస్తామన్న పాన్ మసాలా యాడ్స్‌ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు వీళ్ళే
Phani CH
11 April 2025
Credit: Instagram
చాలా కోట్ల రెమ్యూనరేషన్ తో వచ్చిన పాన్ మసాలా యాడ్ ఆఫర్స్‌ను తిరస్కరించిన కొంతమంది యాక్టర్స్ గురించి ఇప్పుడు తెల్సుకుందాం.
కార్తీక్ ఆర్యన్: యువతకు రోల్ మోడల్‌గా ఉండాలని సుమారు 9 కోట్ల రూపాయల విలువైన పాన్ మసాలా యాడ్ ఒప్పందాన్ని తిరస్కరించాడు.
యష్: కోట్ల రూపాయల విలువైన పాన్ మసాలా యాడ్ డీల్‌ను నిరాకరించాడు. తన అభిమానుల ఆరోగ్యం, సమాజంపై తన ప్రభావాన్ని గుర్తించి, ఈ నిర్ణయం తీసుకున్నాడు.
అల్లు అర్జున్: ‘పుష్ప’ స్టార్ అల్లు అర్జున్, 10 కోట్ల రూపాయల విలువైన గుట్కా మరియు మద్యం బ్రాండ్ యాడ్ ఒప్పందాన్ని తిరస్కరించాడు.
ప్రభాస్: ‘బాహుబలి’ స్టార్ ప్రభాస్, 2020లో సుమారు 150 కోట్ల రూపాయల విలువైన వివిధ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఒప్పందాలను నిరాకరించాడు, వీటిలో పాన్ మసాలా బ్రాండ్‌లు కూడా ఉన్నాయి.
జాన్ అబ్రహం: బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం, ఫిట్‌నెస్ ఐకాన్‌గా పేరుగాంచినవాడు, పాన్ మసాలా యాడ్స్‌ను ఎప్పుడూ చేయనని స్పష్టంగా చెప్పాడు.
అనిల్ కపూర్: ఒకప్పుడు బాలీవుడ్‌లో టాప్ యాక్టర్‌గా ఉన్న అనిల్ కపూర్ పెద్ద స్టార్‌గా ఉన్న రోజుల్లో వచ్చిన పాన్ మసాలా యాడ్ ఆఫర్స్‌ను ఆయన తిరస్కరించాడు.