రీ ఎంట్రీ ఇవ్వబోతున్న చిరంజీవి హీరోయిన్.. ఫ్యాన్స్ కు భలేంటి సర్ ప్రైజ్ గా..
Phani CH
11 April 2025
Credit: Instagram
కొంతమంది ముద్దుగుమ్మ లు అప్పట్లో టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగి తరువాత కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు.
మరికొంత మంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీని వదిలేసి పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇండియా వదిలిపెట్టి ఫారెన్ లో సెటిల్ అయ్యారు.
అయితే ఈ చిన్నది మెగాస్టార్ చిరంజీవి సరసన నటించి స్టార్ డమ్ తో టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగి మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వనుంది.
ఆమె ఎవరో కాదు రంభ. అవును రంభ రీ ఎంట్రీకి రెడీ అవుతుందట. రంభ, 90లలో తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందింది.
2010లో కెనడా వ్యాపారవేత్త ఇంద్రకుమార్‌ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. కుటుంబ జీవితంపై దృష్టి పెట్టి, ముగ్గురు పిల్లలతో టొరంటోలో స్థిరపడింది.
అయితే తాజా సమాచారం ప్రకారం రంభ టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. తెలుగులో ముగ్గురు స్టార్ హీరోల మూవీస్‌లో ఆమె ఇప్పటికే బుక్ అయినట్టు తెలుస్తోంది.
పాన్ ఇండియా సినిమాల్లో కూడా ఇంపార్టెంట్ పాత్రల కోసం ఆమెను తీసుకోవాలని చూస్తున్నాట మేకర్స్. రంభను కూడా అప్రోచ్ అవుతున్నారని తెలుస్తోంది.