AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయం లేదా సాయంత్రం ఏ సమయంలో వ్యాయామం చేయడం ఉత్తమం.. ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసా..

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బిజీబిజీ జీవితాన్ని గడుపుతున్నారు. శారీరక శ్రమ తగ్గడంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. దీంతో ఇప్పుడు వ్యాయామం, యోగాను ఆశ్రయించేవారు ఎక్కువ అయ్యారు. కొంతమంది బరువు తగ్గడానికి వ్యాయామం చేస్తారు. మరికొందరు కండరాల నిర్మాణం కోసం వ్యాయామం చేస్తారు. అయితే ఉదయం, సాయంత్రం ఏ సమయంలో వ్యాయామం చేయాలో తెలియక గందరగోళంలో పడతారు. అయితే ఈ రోజు ఏ సమయంలో వ్యాయామం చేయడం అత్యధికంగా ప్రయోజనాలు కలిగిస్తుందో ఈ రోజు మీకు తెలియజేద్దాం.

ఉదయం లేదా సాయంత్రం ఏ సమయంలో వ్యాయామం చేయడం ఉత్తమం.. ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసా..
Exercise Benefits
Surya Kala
|

Updated on: Apr 11, 2025 | 9:17 PM

Share

చాలా మంది ఫిట్‌గా ఉండాలని కోరుకుంటారు. బరువు తగ్గడం, శరీరం షేప్ లో ఉండాలని.. ఒత్తిడి నుంనుంచి ఉపశమనం పొందడం వంటి రకరకాల కారణాలతో ఇప్పుడు చాలా మంది ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు మొగ్గు చూపుతున్నారు. అటువంటి పరిస్థితిలో వ్యాయామం లేదా యోగా దినచర్యలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. అయితే ఎవరికైనా వ్యాయామం చేయడానికి ఉత్తమ సమయం ఏది? ఉదయం లేదా సాయంత్రం ఏది అనే ప్రశ్న ఖచ్చితంగా వారి మనసులోకి వస్తుంది.

కొంతమంది ఉదయం వ్యాయామం చేయడం వల్ల రోజు శక్తితో ప్రారంభమై బరువు త్వరగా తగ్గుతుందని నమ్ముతారు. మరికొందరు సాయంత్రం వ్యాయామం చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అప్పుడు శరీరం మరింత చురుగ్గా ఉంటుంది. అలసట కూడా పోతుంది. మీరు ఏ సమయంలో వ్యాయామం చేయడం ఆరోగ్యకరం అని ఆలోచిస్తుంటే ఈ రోజు మీ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం..

ఉదయం వ్యాయామం చేస్తే ఏమి జరుగుతుంది?

ఉదయం వ్యాయామం చేస్తే .. రోజంతా శరీరాన్ని శక్తివంతంగా ఉంటుంది. ఉదయాన్నే స్వచ్ఛమైన గాలిలో, ప్రశాంతంగా వ్యాయామం చేయడం వల్ల శరీరం, మనస్సు రెండూ ఉల్లాసంగా ఉంటాయి. ఖాళీ కడుపుతో తేలికపాటి కార్డియో కొవ్వును కరిగించడానికి మంచిదని భావిస్తారు. కనుక బరువు తగ్గడానికి ఇది మంచి సమయం. ఉదయం వ్యాయామం శరీర గడియారాన్ని సెట్ చేస్తుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఉదయం సమయం సాధారణంగా తక్కువ రద్దీగా ఉంటుంది. కనుక వ్యాయామంతో దినచర్యను మొదలుపెట్టడం సులభం.

ఇవి కూడా చదవండి

సాయంత్రం వేళల్లో వ్యాయామం చేస్తే ఏమవుతుంది?

సాయంత్రం వేళల్లో వ్యాయామం చేయడం వల్ల శరీరం మరింత చురుగ్గా..ప్రశాంతంగా ఉంటుంది. రోజు కార్యకలాపాల తర్వాత శరీరం కొంత కష్టానికి సిద్ధంగా ఉంటుంది. అదేవిధంగా కండరాల బలం, పనితీరు సాయంత్రం వేళల్లో గరిష్ట స్థాయిలో ఉంటాయి. అయితే కొన్నిసార్లు రోజంతా అలసట కారణంగా సాయంత్రం వ్యాయామం చేయడంలో ఇబ్బంది ఉండవచ్చు. సాయంత్రం వ్యాయామం తర్వాత.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలని కోరుకుంటారు. దీంతో ఈ అలవాటు తినే ఆహారాన్ని నియంత్రణలో ఉంచుతుంది. సాయంత్రం వేళల్లో ఎక్కువ మంది వ్యాయామం చేస్తారు. ఇది బృందంగా ఏర్పడి ఇతర కార్యకలాపాలకు ప్రేరణను అందిస్తుంది.

ఏ సమయం మంచిది?

వ్యాయామం చేయడానికి పట్టే సమయం మీ అవసరాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు మీరు బరువు తగ్గాలనుకుంటే, ఉదయం వ్యాయామం చేయడం వల్ల త్వరగా ఫలితాలు వస్తాయి. మీరు రోజంతా ఉత్సాహంగా ఉండాలనుకుంటే ఉదయం వ్యాయామం ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలంటే సాయంత్రం వ్యాయామం చేయండి. కండరాల నిర్మాణానికి సాయంత్రం వ్యాయామం కూడా మరింత ప్రభావవంతంగా ఉంటుంది.

మరిన్ని జీవనశైలి కథనాల కోసం క్లిక్‌ చేయండి.