ఈ ఫొటోలో ఉన్న బ్యూటీని గుర్తుపట్టారా.. ?
ఈ ఫొటోలో ఉన్న అందాల ముద్దుగుమ్మను గుర్తు పట్టారా? ఈ చిన్నది తన అందంతో ఎంతో మంది మదిని దోచుకుంది. హిందీ సీరియల్స్ తో సందడి చేసిన ఈ అమ్మడు తర్వాత సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చి తన నటన, గ్లామర్ తో మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరంటే?
Updated on: Apr 11, 2025 | 9:12 PM

నాగిని సీరియల్ తో మంచి ఫేమ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ మౌనిరాయ్. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. తన అందం, అభినయంతో బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది.

బుల్లితెర పై చాలా సీరియల్స్ లో నటించిన ఈ అమ్మడు నాగిని సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో వెండితెరపైకి అడుగు పెట్టింది. మొదట హీరో హిట్లర్ ఇర్ లవ్ అనే పంజాబీ సినిమాతో అభిమానులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ.

తర్వాత అక్షయ్ కుమార్ హీరోగా నటించిన గోల్డ్ మూవీతో బాలీవుడ్ లోకి నటిగా అడుగు పెట్టింది. తర్వాత బ్రహ్మస్త్రం మూవీలో కీలక పాత్ర పోషించింది. అంతే కాకుండా పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో కూడా ఆడిపాడింది ఈ చిన్నది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా వైట్ కలర్ డ్రెస్ లో తన అందాలతో అందరినీ మాయ చేసింది. గుర్తు పట్టని విధంగా ఫొటోలకు ఫోజులిచ్చింది.

క్రోచెట్ టాప్ దానికి సరిపోయే ప్యాంట్ ధరించి అందంగా కనిపించింది. రాత్రివేళలో చందమామను చూస్తూ..ఊహల్లోకి వెళ్లిపోయింది.అంతేకాకుండా రుచికరమైన థాలీతో తన డిన్నర్ ముగించింది. దీనికి సంబంధించిన పొటోలు ఈ బ్యూటీ షేర్ చేయడంతో ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ నటిని గుర్తు పట్టారా అంటున్నారు ఈ అమ్మడు అభిమానులు.



