- Telugu News Photo Gallery Cinema photos Chiranjeevi Vishwambhara movie shooting update on 11 04 2025
Vishwambhara: మెగా కాంపౌండ్‌లో కదలిక… ఈ జోరు కంటిన్యూ అవుతుందా ??
సంక్రాంతి బరిలో రిలీజ్ కావాల్సిన విశ్వంభర సడన్‌గా సైడ్ అయ్యింది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ అదే డేట్‌కు రావాలనుకోవటంతో కొడుకు కోసం త్యాగం చేసిన చిరు, ఆ తరువాత కొత్త రిలీజ్ డేట్‌ను ఇంత వరకు లాక్ చేయలేదు. కొద్ది రోజులుగా మూవీ టీమ్ నుంచి ఎలాంటి అప్‌డేట్ లేకపోవటంతో ఫ్యాన్స్‌లో టెన్షన్ మొదలైంది. ఫైనల్‌గా అప్‌డేట్ రావటంతో సైలెన్స్‌కు తెర పడింది.
Updated on: Apr 11, 2025 | 9:04 PM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఫాంటసీ మూవీ విశ్వంభర. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్ చేయాలని భావించారు. కానీ అప్పటికి షూటింగ్ పూర్తి కాకపోవటం, అదే డేట్‌కు రామ్ చరణ్ సినిమా రిలీజ్ ఉండటంతో విశ్వంభర వాయిదా పడింది.

అయితే ఈ డిలే మరింత క్వాలిటీ అవుట్‌పుట్ ఇచ్చేందుకు వాడుకుంటున్నారు చిరు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ మీద దృష్టి పెట్టింది. ఫాంటసీ మూవీ కావటంతో విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారు.

ఈ మధ్యకాలంలో కొన్ని భారీ చిత్రాల గ్రాఫిక్స్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అందుకే విశ్వంభర విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు చిరు. ఫైనల్ అవుట్‌పుట్ విషయంలో ఓ క్లారిటీ రావటంతో ప్రమోషన్ స్టార్ట్ చేసింది మూవీ టీమ్.

రామ రామ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను ఏప్రిల్ 12న రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించింది. ఈ అప్‌డేట్‌తో మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమా రిలీజ్ విషయంలోనూ ఓ హిట్ సెంటిమెంట్‌ను రిపీట్ చేసే ఆలోచనలో ఉంది చిత్రయూనిట్.

ఇంద్ర లాంటి బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ అయిన జూలై 24న విశ్వంభర రిలీజ్‌కు ప్లాన్ చేస్తోంది మూవీ టీమ్. ప్రస్తుతానికి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ లేకపోయినా... రిలీజ్ డేట్ విషయంలోనూ యూనిట్ డెసిషన్ తీసేసుకుందన్న టాక్ వినిపిస్తోంది.




