అద్దంలో అద్భుతం..! కాశ్మీరా అందాలు వర్ణించాలంటే మన్మథుడు దిగిరావాలి
కాశ్మీరా పరదేశి తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ, కన్నడ చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది.. మహారాష్ట్రలోని ముంబైలో మరాఠీ కుటుంబంలో జన్మించిన ఆమె, పూణేలోని సెయింట్ ఆన్స్ స్కూల్‌లో పాఠశాల విద్యను, బృహన్ మహారాష్ట్ర కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో కళాశాల విద్యను పూర్తి చేసింది. ఆమె ముంబైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైన్ కూడా అభ్యసించింది.
Updated on: Apr 11, 2025 | 8:56 PM

సినిమాల్లోకి రాకముందు కాశ్మీరా అనేక వాణిజ్య ప్రకటనల్లో నటించింది. 2018లో నాగశౌర్య సరసన తెలుగు చిత్రం "నర్తనశాల"తో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సాధారణ విజయాన్ని సాధించినప్పటికీ, ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది.

2019లో హిందీ చిత్రం "మిషన్ మంగళ్"లో విద్యా బాలన్, సంజయ్ కపూర్ కుమార్తెగా నటించి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అదే ఏడాది తమిళ చిత్రం "శివప్పు మంజల్ పచ్చై"లో జీవీ ప్రకాష్ కుమార్ సరసన, మరాఠీ చిత్రం "రాంపట్"లో నటించింది.

2021లో కన్నడ చిత్రం "రైడర్"లో నిఖిల్ కుమార్ సరసన నటించి కన్నడ సినిమా రంగంలోకి ప్రవేశించింది. 2023లో హిందీ వెబ్ సిరీస్ "ది ఫ్రీలాన్సర్"తో డిజిటల్ స్ట్రీమింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. కాశ్మీరా తన నటనతో వివిధ భాషల్లో తనదైన ముద్ర వేస్తోంది.

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ.. అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ చిన్నదాని ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.