ఒక్క ఓవర్‌లో 22 బంతులు, 77 పరుగులు.. ప్రపంచంలోనే చెత్త బౌలర్

TV9 Telugu

26 April 2025

ఒక ఓవర్‌లో 36 పరుగులు సాధించవచ్చని తెలిసిందే. కానీ, 36 కంటే ఎక్కువ పరుగులు వచ్చాయని తెలిస్తే ఎలా ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే.

ఇప్పుడు చెప్పబోయే ఓవర్‌లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో ఏకంగా 77 పరుగులు వచ్చాయి. కాగా, ఈ మ్యాచ్‌లో కేవలం 2 ఓవర్లలోనే 94 పరుగులు వచ్చాయి.

ఈ మ్యాచ్ 1990 సంవత్సరంలో జరిగింది. క్రైస్ట్‌చర్చ్‌లోని కాంటర్‌బరీ వర్సెస్ వెల్లింగ్టన్ మధ్య ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో ఈ రికార్డ్ పరుగులు వచ్చాయి.

ఈ షెల్ ట్రోఫీ మ్యాచ్‌లో ఈ అద్భుతం చోటు చేసుకుంది. మ్యాచ్ చివరి రోజున, కాంటర్బరీ విజయానికి 2 ఓవర్లలో 95 పరుగులు అవసరం అయ్యాయి.

కానీ, ఒక్క ఓవర్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. వెల్లింగ్టన్ బౌలర్ బెర్ట్ వాన్స్ ఒక ఓవర్లో 22 బంతులు వేశాడు. ఇందులో 17 నో బాల్స్ ఉన్నాయి. 

దీంతో ఈ ఓవర్‌లో మొత్తం 77 పరుగులు వచ్చాయి. ఇందులో 8 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. రికార్డు పరుగులతో మ్యాచ్‌ రిజల్ట్‌ను డ్రాగా మార్చేశారు.

కాంటర్బరీ బ్యాట్స్‌మన్ లీ జర్మన్ 22 బంతుల్లో 70 పరుగులు చేశాడు. ఈ 22 బంతులు ఒకే ఓవర్లో వేయడం గమనార్హం. దీంతో ఒకే ఓవర్లో 70 పరుగులు సాధించాడు.

చివరి ఓవర్లో విజయానికి 18 పరుగులు అవసరం. కానీ ఈ ఇద్దరు బ్యాటర్స్ కలిసి 17 పరుగులు చేశారు. ఈ విధంగా 2 ఓవర్లలో 94 పరుగులు వచ్చాయన్నమాట.