స్పీడ్ పెంచిన ప్రియా ప్రకాష్ వారియర్.. వరుసగా రెండు హిట్స్
Rajeev
26 April 2025
Credit: Instagram
తొలి సినిమాతోనే అభిమానులను ఆకట్టుకుంది ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్. ఒక్క సీన్ తో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.
ఈ క్రేజీ బ్యూటీ సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కుగా బిజీగా గడిపేస్తోంది.
చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి క్రేజ్ తెచ్చుకుంది. కేవలం ఒక్క వీడియో క్లిప్‌తో రాత్రికి రాత్రే పాపులర్ అయ్యింది ప్రియా ప్రకాష్ వారియర్.
ఓరు ఆధార్ లవ్ అనే సినిమాతో పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. కానీ ప్రియా ప్రకాష్ కు మంచి క్రేజ్ వచ్చింది
ఆతర్వాత మలయాళంలో వరుసగా సినిమాలు చేసింది. ఇక తెలుగులో నితిన్ హీరోగా నటించిన చెక్ అనే సినిమాతో అడుగు పెట్టింది.
కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. కేరళకు చెందిన ఈ బ్యూటీ మలయాళ సినిమాలతో పాటు తెలుగు, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తోంది
మొన్నటివరకు వరుస ఫ్లాప్స్ అందుకున్న ఈ అమ్మడు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటుంది. రీసెంట్ గా జాబిలమ్మ నీకు అంతకోపమా.. , గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో హిట్స్ కొట్టింది.