లాక్‌డౌన్: దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పిన పీఎం మోదీ
దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. 21 రోజులపాటు లాక్‌డౌన్ నిర్వహించాలని తాను ప్రకటించక తప్పలేదని.. అందుకు తనను క్షమించాలని కోరారు మోదీ. తనపై పేద ప్రజలకు చాలకోపంగా ఉందన్న ప్రధాని..

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. 21 రోజులపాటు లాక్‌డౌన్ నిర్వహించాలని తాను ప్రకటించక తప్పలేదని.. అందుకు తనను క్షమించాలని కోరారు మోదీ. తనపై పేద ప్రజలకు చాలకోపంగా ఉందన్న ప్రధాని.. వేరే మార్గం లేకనే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇతర దేశాల్లాగా మనం దేశం కూడా కరోనా వల్ల అల్లకల్లోలం కాకుండా ఉండకూడదన్న ఆలోచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మన్ కీ బాత్ ద్వారా తెలిపారు. కరోనాపై పోరాడాలంటే ఇలాంటి నిర్ణయం తప్పడం సరి అన్నారు. అందుకే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రపంచ దేశాల్ని గమనించినప్పుడైనా మనం ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పదని.. ఇది మీకు అర్థమవుతుందని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా తెలిపారు. దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే నా ప్రధాన కోరికని అన్నారు.
63వ మన్ కీ బాత్ ఎడిషన్‌లో దేశ ప్రజలతో ఉదయం 11 గంటలకు రేడియోలో మాట్లాడిన ప్రధాని.. ఈ సారి ప్రధానంగా కరోనా గురించే చర్చించారు. సోషల్ డిస్టాన్సింగ్ అనేది మాత్రమే మనల్ని వైరస్ నుంచి కాపాడుతుందని అన్నారు. క్వారెంటైన్లకు వెళ్లమన్నప్పుడు చాలా మంది వైద్యులు, పోలీసుల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారన్న మోదీ.. అలాంటి చర్యలకు తాను బాధపడుతున్నాని అన్నారు. అలాగే ఆయన ప్రత్యేకంగా డాక్టర్లకు, పోలీసులకు తాను సెల్యూట్ చేస్తున్నానని.. వారి సేవలు అపూర్వమని అన్నారు.
Talking about aspects relating to COVID-19 during #MannKiBaat https://t.co/JJpOShFBpB
— Narendra Modi (@narendramodi) March 29, 2020
ఇవి కూడా చదవండి:
పాలపై టీఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్విగ్గీ, బిగ్ బాస్కెట్‌ల ద్వారా..
డేంజరస్ వైరస్: కోలుకున్న తర్వాత కూడా 8 రోజులు శరీరంలోనే
కన్నీటి పర్యంతమైన కమెడియన్.. మిమ్మల్ని వేడుకుంటున్నా..
మందు బాబులకు గుడ్‌న్యూస్.. అంతలోనే బ్యాడ్‌న్యూస్
ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త.. ముహుర్తం ఫిక్స్..
కరోనాకు తోడు ఎయిడ్స్.. కంపెనీ క్లోజ్
ఫ్లాష్‌న్యూస్: కరోనాకు మందు లేదు.. 18 నెలలు ఆగాల్సిందే: WHO క్లారిటీ