AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేసవిలో పెరుగు కమ్మగుండాలంటే ఇలా చేసి చూడండి.. ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది

వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు పెరుగు త్వరగా పులుసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సాధారణమైన జాగ్రత్తలు తీసుకుంటే పెరుగు కమ్మగా తయారవడమే కాకుండా ఎక్కువసేపు తాజాగా నిల్వ ఉంటుంది. ఈ సరళమైన చిట్కాలను అనుసరిస్తే మంచి రుచితో పాటు ఆరోగ్యంగా ఉండే పెరుగును ఇంట్లోనే తయారు చేయవచ్చు.

వేసవిలో పెరుగు కమ్మగుండాలంటే ఇలా చేసి చూడండి.. ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది
Curd Benefits
Prashanthi V
|

Updated on: Apr 24, 2025 | 11:32 AM

Share

పెరుగు సిద్ధం చేయాలంటే మొదట తాజాగా లభించే పాలను ఎంపిక చేయాలి. ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసిన పాలను వాడితే పాలు త్వరగా పులుసే ప్రమాదం ఉంటుంది. అందుకే పాలను తొలుత బాగా మరిగించాలి. ఆ తరువాత గోరువెచ్చగా మారిన తరువాతే తోడు వేసి మూతపెట్టాలి. పెరుగుకు తోడు వేసే సమయంలో పాల ఉష్ణోగ్రత గోరువెచ్చగా ఉండాలి. మరీ వేడి పాలలో లేదా పూర్తిగా చల్లారిన పాలలో తోడు వేస్తే పెరుగు సరిగ్గా కుదిరే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందుకే గోరువెచ్చగా ఉన్న సమయంలోనే తోడు వేయాలి.

పెరుగును కమ్మగా తయారు చేయాలంటే మట్టితో చేసిన గిన్నెలో లేదా సిరామిక్ పాత్రలో తోడు పెట్టడం ఉత్తమంగా ఉంటుంది. ఇవి తేమను నిలుపుకోవడం వల్ల పెరుగు నెమ్మదిగా, గట్టిగా కుదిరి మంచి రుచిని ఇస్తుంది.

పాలను మరిగించిన తర్వాత గోరువెచ్చగా ఉన్న దశలో ఒక చిన్న టీస్పూన్ చక్కెర కలిపితే పెరుగు పుల్లగా మారకుండా ఉంటుంది. వేసవి వేడి ఎక్కువగా ఉండే కారణంగా చక్కెర ఉపయోగించడం వల్ల పుల్లదనం తగ్గుతుంది.

పెరుగుకు తోడు వేసిన తర్వాత అందులో ఒక ఎండు మిర్చి లేదా పచ్చి మిర్చిని వేసే సంప్రదాయం ఉంది. ఇది పెరుగు గట్టిగా తయారవడంలో సహాయపడుతుంది. ఇదొక పాత పద్ధతి అయినా నేటికీ ఉపయోగపడుతోందంటే అందులో లాభం ఉండడమే కారణం.

పెరుగును సిద్ధం చేసే గిన్నెను ఉంచే ప్రదేశం ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. వేడి ఎక్కువగా ఉన్న చోట ఉంచితే పెరుగు తక్కువ సమయంలోనే పులుసే ప్రమాదం ఉంటుంది. అందుకే చల్లటి మూలను ఎంచుకొని గిన్నెను అక్కడ ఉంచడం మంచిది.

పెరుగు పూర్తిగా గట్టిగా తయారైన తరువాత దానిని గాలి చొరబడని డబ్బాలో వేసి ఫ్రిడ్జ్‌లో నిల్వ చేయాలి. ఇలా ఉంచడం వల్ల ఎక్కువ రోజులు నాణ్యతతో పాటు రుచిని కూడా కాపాడుకోవచ్చు. ఇది వేసవిలో తప్పనిసరిగా పాటించాల్సిన అలవాటు.

పెరుగు తీసేటప్పుడు ఎప్పుడూ శుభ్రంగా ఉండే పొడి స్పూన్‌నే వాడాలి. ఉపయోగించిన స్పూన్‌ను మళ్లీ పెరుగులో వేసినట్లయితే మిగతా పెరుగు త్వరగా పులుసే ప్రమాదం ఉంటుంది. వేసవి కాలంలో పెరుగు త్వరగా పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ పై సూచనలు పాటిస్తే తక్కువ శ్రమతో మంచి రుచితో కూడిన పెరుగు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!