AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahma Muhurta: బ్రహ్మమూహూర్తంలో మేల్కొంటే ఏం జరగుతుందో తెలుసా? సైన్స్ రహస్యం ఇదే

ఉదయం పూట తెల్లవారుజామున నిద్ర లేవడం ఆరోగ్యానికే కాదు మనలోని దాగివున్న మానసిక శక్తులు మేల్కోనడానికి ఇది సరైన సమయం. ముఖ్యంగా తెల్లవారు జామున బ్రహ్మ ముహూర్తంలో మేల్కోంటే ఎన్నాళ్ల నుంచో సాధించాలనుకుంటున్న మీ వ్యక్తిగత విజయాలు సుసాధ్యం అవుతాయి. ఇది సైన్స్ చెప్పే మాట..

Brahma Muhurta: బ్రహ్మమూహూర్తంలో మేల్కొంటే ఏం జరగుతుందో తెలుసా? సైన్స్ రహస్యం ఇదే
Scientific Secret Of Brahma Muhurtam
Srilakshmi C
|

Updated on: Dec 27, 2025 | 8:35 PM

Share

తెల్లవారుజామున నిద్రలేవడం మంచిదని ప్రతి ఇంట్లో పెద్దోళ్లు చెబుతుంటారు. ఈ ఆచారం శారీరక, మానసిక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా ఇతర పనులకు కూడా మంచిదట. ముఖ్యంగా బ్రహ్మ ముహూర్త సమయంలో మేల్కొనడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. హిందూ మతంలో బ్రహ్మ ముహూర్తాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఉదయం 4 గంటల నుంచి 5:30 గంటల వరకు సమయాన్ని బ్రహ్మ ముహూర్తంగా పరిగణిస్తారు. ఈ సమయంలో మేల్కొనడం వల్ల బలం, జ్ఞానం, ఆరోగ్యం లభిస్తాయని నమ్ముతారు. కాబట్టి ఈ బ్రహ్మ ముహూర్త సమయంలో మేల్కొనడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

బ్రహ్మ ముహూర్త సమయంలో మేల్కొనడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

మత విశ్వాసాల ప్రకారం బ్రహ్మ ముహూర్త సమయంలో మేల్కొనడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో మేల్కొనే వ్యక్తిని దేవతలు ఆశీర్వదిస్తారు. ఇంకా బ్రహ్మ ముహూర్త సమయంలో మేల్కొనే అలవాటే జీవితంలో అపారమైన విజయాన్ని తీసుకురావడానికి సహాయపడుతుందని నమ్మకం.

శాస్త్రీయ దృక్కోణంలో చూస్తే.. బ్రహ్మ ముహూర్తంలో అధిక స్థాయిలో ఆక్సిజన్, తక్కువ స్థాయిలో కాలుష్యం ఉంటుంది. ఈ వాతావరణం శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది మానసిక స్పష్టత, ఒత్తిడి నుంచి ఉపశమనం, బలమైన రోగనిరోధక వ్యవస్థ వంటి ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

బ్రహ్మ ముహూర్త సమయంలో మేల్కొనడం వల్ల శరీర సిర్కాడియన్ లయను నియంత్రిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది.

శక్తి

బ్రహ్మ ముహూర్త సమయంలో గాలి ఆక్సిజన్‌తో సమృద్ధిగా ఉంటుంది. ఈ తాజా గాలి శరీరాన్ని ఉల్లాసపరిచి శక్తినిస్తుంది. ఇది రోజులోని అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది.

మంచి నిద్ర

బ్రహ్మ ముహూర్త సమయంలో మేల్కొనడం వల్ల నిద్ర విధానాలు క్రమబద్ధీకరించబడతాయి. ఇది నిద్రలేమిని తగ్గిస్తుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.

మంచి రోగనిరోధక శక్తి

బ్రహ్మ ముహూర్త సమయంలో క్రమం తప్పకుండా మేల్కొనడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ సమయంలో వాతావరణం స్వచ్ఛమైన ఆక్సిజన్‌తో సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Scientific Secret Of Brahma Muhurtam

మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం

బ్రహ్మ ముహూర్త సమయంలో వాతావరణం ప్రశాంతంగా, స్వచ్ఛంగా ఉంటుంది, ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి వీలు కల్పిస్తుంది. అలాగే ఈ సమయం ధ్యానం, యోగా, ప్రాణాయామం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది.

బ్రహ్మ ముహూర్త సమయంలో మేల్కొనడానికి ఈ దశలను అనుసరించాలి..

  • బ్రహ్మ ముహూర్త సమయంలో మేల్కొనాలంటే రాత్రి త్వరగా పడుకోవడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజూ 7 గంటలు నిద్రపోవాలని లక్ష్యంగా పెట్టుకోవాలి.
  • బ్రహ్మ ముహూర్త సమయంలో మేల్కొలపడానికి భారీ భోజనం మానుకోవాలి. రాత్రి భోజనం తేలికగా ఉండాలి.
  • బ్రహ్మ ముహూర్తానికి 15 నిమిషాల ముందు మీ అలారం సెట్ చేసుకోండి. ఇది మీరు త్వరగా మేల్కొనడానికి సహాయపడుతుంది. మొదట ఒకటి లేదా రెండు రోజులు నిరుత్సాహంగా అనిపించవచ్చు. కానీ తరువాతి రోజుల్లో మీరు త్వరగా మేల్కొనడానికి అలవాటు పడతారు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

బ్రహ్మమూహూర్తంలో మేల్కొంటే ఏం జరగుతుందో తెలుసా? సైన్స్ రహస్యం ఇదే
బ్రహ్మమూహూర్తంలో మేల్కొంటే ఏం జరగుతుందో తెలుసా? సైన్స్ రహస్యం ఇదే
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
మీ జుట్టు ఒత్తుగా పెరగాలా.. అయితే బీరుతో ఇలా చేస్తే చాలు..
మీ జుట్టు ఒత్తుగా పెరగాలా.. అయితే బీరుతో ఇలా చేస్తే చాలు..
తేనె, బెల్లం నిజంగా ఆరోగ్యకరమేనా? షాకింగ్ నిజాలు!
తేనె, బెల్లం నిజంగా ఆరోగ్యకరమేనా? షాకింగ్ నిజాలు!
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
OTTలో బిగ్గెస్ట్ కాంట్రవర్సీ మూవీ.. ఐఎమ్‌డీబీలో 8.6/10 రేటింగ్
OTTలో బిగ్గెస్ట్ కాంట్రవర్సీ మూవీ.. ఐఎమ్‌డీబీలో 8.6/10 రేటింగ్
డిసెంబర్ 31న గిగ్ వర్కర్ల సమ్మెతో వీటిపై భారీ ప్రభావం..
డిసెంబర్ 31న గిగ్ వర్కర్ల సమ్మెతో వీటిపై భారీ ప్రభావం..
ఇష్టమని ఊరగాయ పచ్చడి లాగించేస్తున్నారా? ఐతే మీకీ విషయం చెప్పాలి
ఇష్టమని ఊరగాయ పచ్చడి లాగించేస్తున్నారా? ఐతే మీకీ విషయం చెప్పాలి
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
మీ ఇంటి మెట్ల కింద ఇవి ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే కష్టాలు..
మీ ఇంటి మెట్ల కింద ఇవి ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే కష్టాలు..