AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఇద్దరు పిల్లకాయల్లో ఓ క్రేజీ హీరోయిన్ ఉంది.. ఆమె కోసం కుర్రాళ్లు పడిచచ్చిపోతారు

సినీ తారాల చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటోల వరకు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి. రెగ్యులర్ గా హీరోయిన్స్ తన ఫోటోలను, సినిమా అప్డేట్స్ ను, కొంతమంది వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో చక్కర్లు కొడుతుంది.

ఈ ఇద్దరు పిల్లకాయల్లో ఓ క్రేజీ హీరోయిన్ ఉంది.. ఆమె కోసం కుర్రాళ్లు పడిచచ్చిపోతారు
Actress
Rajeev Rayala
|

Updated on: Mar 06, 2026 | 7:56 PM

Share

అమాయకపు చూపులతో చారడేసి కళ్లతో ముద్దులొలుకుతున్న ఈ ఇద్దరు బుజ్జాయిల్లో ఓ ముద్దుగుమ్మ సౌత్ చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళం భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అందం, టాలెంట్ ఉన్నా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రావడం లేదు. అవకాశాలు వచ్చినా కూడా అదృష్టం కలిసిరావడంలేదు. చాలా రోజులుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న హీరోయిన్‌కు ఫాలోయింగ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. వెండితెరపై సందడి చేయకపోయిన సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఈ వయ్యారి భామ. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్‌లో ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ హీరోయిన్ చిన్ననాటి ఫోటో నెట్టింట వైరలవుతుంది. ఆమె ఎవరో గుర్తుపట్టారా ? ఆమె కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్..

మూడు పెళ్లిళ్లు.. అన్ని ఫ్లాప్..! తనకన్నా 25ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన స్టార్ హీరోయిన్.!!

ఆ లిటిల్ క్యూటీస్ లో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు క్రేజీ బ్యూటీ మేఘా ఆకాష్. యంగ్ హీరో నితిన్ నటించిన లై సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ అందాల భామ. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‏గా నిలిచింది. ఈ సినిమా తర్వాత మరోసారి నితిన్ కు జోడీగా చల్ మోహన్ రంగ చేసింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రియమైన మేఘ సినిమాల్లో నటించి మెప్పించింది. తమిళంలోనూ పలు హిట్ చిత్రాల్లో నటించింది. ఏకంగా రజినీకాంత్ పేట సినిమాలోనూ నటించింది మేఘ.

దిమాక్ ఖరాబ్..! ఎనిమిది మంది డైరెక్టర్లు తీశారు.. మనుషుల్నిపీక్కు తినే హారర్ మూవీ..!! ఎక్కడ చూడొచ్చంటే

దీంతో ఈ అమ్మడుకు తెలుగులో ఆఫర్స్ రాకపోవడంతో కోలీవుడ్ షిప్ట్ అయ్యింది. తమిళంలో వరుస సినిమాలు చేస్తూ అక్కడే టాప్ హీరోయిన్ గా మారింది. అప్పుడప్పుడు తెలుగులో ఒకట్రెండు చిత్రాల్లో మెరిసింది. కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న మేఘా ఆకాష్ రాజా రాజ చోర, డియర్ మేఘా, గుర్తుందా శీతాకాలం, ప్రేమదేశం, రావణాసుర, మనుచరిత్ర వంటి చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ మేఘాకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. చివరిగా వికటకవి అనే సినిమాలో నటించింది. సోషల్ మీడియాలో నిత్యం ఏదోక ఫోటో షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది అందాల తార.

బుసకొట్టే నాగు పామును భయం లేకుండా పట్టేసుకుంది.. ఈ పాప ఎవరో తెలుసా.?

View this post on Instagram

A post shared by Megha Akash (@meghaakash)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us