AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఛైల్డ్ హుడ్ ఫ్రెండ్స్.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఎవరో గుర్తు పట్టారా?

ఈ ఇద్దరు హీరోలది సినిమా నేపథ్యమున్న కుటుంబమే. ఒకరు స్టార్ నటుడి, నటి కుమారుడు అయితే.. మరొకరు స్టార్ డైరెక్టర్ కొడుకు. తమ తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తూ వీరు కూడా బాల నటులుగా చిన్నతనంలోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇప్పుడు హీరోలుగా రాణిస్తున్నారు.

Tollywood: ఛైల్డ్ హుడ్ ఫ్రెండ్స్.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఎవరో గుర్తు పట్టారా?
Cinema Actors
Basha Shek
|

Updated on: Mar 06, 2026 | 7:32 PM

Share

పై ఫొటోలో ఉన్న ఇద్దరు అబ్బాయిలను గుర్తు పట్టారా? వీరు ఇప్పుడు స్టార్ హీరోలు. తమ నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇద్దరూ సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచే వచ్చారు. తమ తల్లిదండ్రుల సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ చిన్న తనంలోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఛైల్డ్ ఆర్టిస్టులుగా చాలా సినిమాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత హీరోలుగానూ సక్సెస్ అయ్యారు. స్టార్ నటులయ్యాక కూడా ఇప్పటికీ వీరు తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఆ ఫ్రెండ్ షిప్ కారణంగానే కొన్ని సినిమాల్లో కలిసి నటించారు కూడా. ఇందులో ఒకరు హీరోగా, సింగర్ గా రాణిస్తుంటే మరొకరు హీరోగా, విలన్ గానూ మెప్పిస్తున్నాడు. ప్రస్తుతం సౌతిండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగొందుతున్న వారు మరెవరో కాదు.. శింబు, అరుణ్ విజయ్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన టి. రాజేందర్ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు శింబు. ఛైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత హీరోగానూ ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇక శింబు క్లోజ్ ఫ్రెండ్ అయిన అరుణ్ విజయ్ మరెవరో కాదు తెలుగు, తమిళ్ సినిమాల్లో నటించి మెప్పించిన విజయ్ కుమార్ కుమారుడు. తమిళంలో హీరోగా వెలుగొందుతోన్న అతను తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయమే. పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అరుణ్ రామ్ చరణ్ నటించిన బ్రూస్లీ సినిమాలో విలన్ గా ఆకట్టుకున్నాడు. అలాగే సాహో సినిమాలోనూ ప్రభాస్ ఫ్రెండ్ గా ఓ కీలక పాత్రలో మెరిశాడు.

శింబు, అరుణ్ విజయ్ క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పటికీ తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఈ కారణంగానే మణిరత్నం తెరకెక్కించిన చెక్క చివంద వానమ్‌ (తెలుగులో నవాబ్) సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు. కాగా శింబు చివరిగా థగ్ లైఫ్ అనే సినిమాలో నటించాడు. మణిరత్నం తెరకెక్కించిన ఈ మల్టీ స్టారర్ మూవీలో కమల్ హాసన్ మరో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. అరసన్ తో పాటు ఎస్‌టీఆర్ 50, ఎస్‌టీఆర్ 51 సినిమాల్లో నటిస్తున్నాడు శింబు.

ఇవి కూడా చదవండి

ఇక అరుణ్ విజయ్ విషయానికి వస్తే.. గతేడాది మూడు సినిమాల్లో నటించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. వనంగాన్ సినిమాతో హీరోగా మెప్పించిన అరుణ్ ధనుష్ హీరోగా నటించిన ఇడ్లీ కడైలో విలన్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో చేతిలోనూ పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us