పాలపై టీఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్విగ్గీ, బిగ్ బాస్కెట్‌ల ద్వారా..
కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం వీలయినన్ని చర్యలు వన్ బై వన్ చేపడుతూనే ఉంది. దురదృష్టమేంటంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. తెలంగాణలో వైరస్ పెరుగుతూనే ఉంది. తాజాగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 67కి చేరుకుంది. దీంతో మరింత అప్రమత్తమైన ప్రభుత్వం ఓ అద్భుతమైన..

కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం వీలయినన్ని చర్యలు వన్ బై వన్ చేపడుతూనే ఉంది. దురదృష్టమేంటంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. తెలంగాణలో వైరస్ పెరుగుతూనే ఉంది. తాజాగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 67కి చేరుకుంది. దీంతో మరింత అప్రమత్తమైన ప్రభుత్వం ఓ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై పాల కోసం ఎవరూ బయటకు రానీయకుండా.. స్విగ్గీ, బిగ్ బాస్కెట్ వంటి డోర్ డెలివరీ కంపెనీల ద్వారా పాలు సరఫరా చేసేలా చెయ్యాలని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.
తాజాగా మాసాబ్ ట్యాంక్‌లోని పశు సంవర్థక భవనంలో.. వివిధ డెయిరీల ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. హైదరాబాద్ లాక్‌డౌన్‌కు ముందు రోజూ 30 లక్షల లీటర్ల పాలు సప్లై అయ్యేవనీ.. ఇప్పుడు 20 లక్షలకు తగ్గాయనీ.. పాలను సప్లై చేసే సిబ్బంది రావడం లేదని విజయ డెయిరీ ఎండీ శ్రీనివాసరావు తెలిపారు. అలాంటప్పుడు స్విగ్గీ, బిగ్ బాస్కెట్ వంటి సేవలను వాడుకోమని మంత్రి తెలిపారు.
అలాగే ఈ సందర్భంగా పలు సూచనలు కూడా జారీ చేశారు. లాక్‌డౌన్ నెపంతో.. అధిక రేట్లు వస్తూ చేయకూడదన్నారు. ఎమ్మార్పీ కంటే పాలను ఎక్కువ అమ్మితే.. పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరికైనా పాలు సప్లై అవ్వకపోతే కంట్రోల్ రూం నెంబర్ 040-23450624కి కంప్లైంట్ చేయమన్నారు. అలాగే ఆయా డోర్ డెలివరీ సంస్థలతో మాట్లాడిన అనంతరం.. చర్చలు సఫలం అయితేనే.. పాలు ఇళ్లకు వస్తాయన్నారు.
ఇవి కూడా చదవండి:
డేంజరస్ వైరస్: కోలుకున్న తర్వాత కూడా 8 రోజులు శరీరంలోనే
కన్నీటి పర్యంతమైన కమెడియన్.. మిమ్మల్ని వేడుకుంటున్నా..
మందు బాబులకు గుడ్‌న్యూస్.. అంతలోనే బ్యాడ్‌న్యూస్
ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త.. ముహుర్తం ఫిక్స్..
కరోనాకు తోడు ఎయిడ్స్.. కంపెనీ క్లోజ్
ఫ్లాష్‌న్యూస్: కరోనాకు మందు లేదు.. 18 నెలలు ఆగాల్సిందే: WHO క్లారిటీ



