మహరాష్ట్రలోనే అత్యధికం.. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఎన్నంటే.?

Coronavirus: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే ఈ వైరస్ 27 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు వేగంగా విస్తరించింది. ఇక ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1037కు చేరినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మహమ్మారి కారణంగా 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు ఈ వైరస్ బారి నుంచి 85 మంది కోలుకోగా.. 929 మంది చికిత్స పొందుతున్నారు. కాగా.. కేరళ, మహారాష్ట్రలలో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా […]

మహరాష్ట్రలోనే అత్యధికం.. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఎన్నంటే.?
Follow us

|

Updated on: Mar 29, 2020 | 11:24 AM

Coronavirus: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే ఈ వైరస్ 27 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు వేగంగా విస్తరించింది. ఇక ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1037కు చేరినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మహమ్మారి కారణంగా 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు ఈ వైరస్ బారి నుంచి 85 మంది కోలుకోగా.. 929 మంది చికిత్స పొందుతున్నారు.

కాగా.. కేరళ, మహారాష్ట్రలలో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక నిన్నటివరకు టాప్‌లో ఉన్న కేరళను మహారాష్ట్ర వెనక్కి నెట్టేసింది. తాజాగా సమాచారం ప్రకారం మహారాష్ట్ర-193, కేరళ- 182, కర్ణాటక- 81, తెలంగాణ-67, గుజరాత్-55, రాజస్థాన్-55, యూపీ-65, ఢిల్లీ-49, తమిళనాడు-42, పంజాబ్-38, హర్యానా-35, మధ్యప్రదేశ్‌-39, జమ్ముకశ్మీర్-33, పశ్చిమ బెంగాల్-18, ఆంధ్రప్రదేశ్ – 19, లడక్-13, బీహార్ – 11, ఛండీగర్-8, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ – 9, ఛత్తీస్‌ఘర్‌-7, ఉత్తరాఖండ్ – 6, గోవా-3, హిమాచల్‌ప్రదేశ్-3, ఒడిశా – 3, మణిపూర్‌-1, మిజోరం- 1, పుదుచ్చేరి-1 కేసులు నమోదయ్యాయి.

Read This: దేశంలో తొలి కరోనా టెస్టింగ్ కిట్ వెనుకున్న ఆ మహిళ ఎవరంటే…