భారత్‌లో రెండో దశలోనే కొనసాగుతున్న కరోనా .. క్లారిటీ ఇచ్చిన ICMR…

Coronavirus: కరోనా వైరస్ దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో కరోనా ఇండియాలో మూడో దశకు చేరుకుందన్న అనుమానాలు కొందరిలో వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో థర్డ్ స్టేజికి చేరుకుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక దీనిపై తాజాగా ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ స్పందించింది. కరోనా వైరస్ దేశంలో మూడో దశకు చేరుకుందని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. అలాంటి […]

భారత్‌లో రెండో దశలోనే కొనసాగుతున్న కరోనా .. క్లారిటీ ఇచ్చిన ICMR...
Follow us

|

Updated on: Mar 29, 2020 | 1:58 PM

Coronavirus: కరోనా వైరస్ దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో కరోనా ఇండియాలో మూడో దశకు చేరుకుందన్న అనుమానాలు కొందరిలో వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో థర్డ్ స్టేజికి చేరుకుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక దీనిపై తాజాగా ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ స్పందించింది.

కరోనా వైరస్ దేశంలో మూడో దశకు చేరుకుందని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. అలాంటి పుకార్లను నమ్మవద్దని ఐసీఎంఆర్ ప్రకటించింది. అటు ఐసీఎంఆర్ సైంటిస్ట్ ఆర్. గంగాఖేడ్కర్ మాట్లాడుతూ ప్రజలు అందరూ కూడా సామాజిక దూరాన్ని పాటిస్తూ.. కరోనా మూడు స్టేజికి వెళ్ళకుండా నియంత్రించాలని సూచించారు. తీవ్రమైన శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న వారిలో 10 శాతం(అంటే 110 మందిలో 11) మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని ఆయన అన్నారు.

మరోవైపు ఎటువంటి ట్రావెల్ హిస్టరీ, కరోనా బాధితులతో కాంటాక్ట్ లేని చెన్నై, ఉత్తరప్రదేశ్, మహరాష్ట్రలకు చెందిన ముగ్గురు పేషంట్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్న ఆయన.. ఈ ఆధారాలు ద్వారా కరోనా వైరస్ కమ్యునిటీ ట్రాన్స్‌మిషన్(సమూహాల ద్వారా వ్యాప్తి) దశలో ఉందని చెప్పలేమన్నారు.

ప్రస్తుతం ఇండియాలో కరోనా వైరస్ కమ్యునిటీ ట్రాన్స్‌మిషన్(సమూహాల ద్వారా వ్యాప్తి) దశలో లేదని, రెండో దశలోనే ఉందని గంగాఖేడ్కర్ జాతీయ మీడియాకు తెలిపారు. అయితే పరిస్థితిని ఇప్పుడు అదుపు చేయలేకపోతే మాత్రం తీవ్ర నష్టం తప్పదని ఆయన అన్నారు. కాగా, కోవిడ్ 19ను నివారించేందుకు ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తూ.. కొద్దిరోజులు ఇళ్లకే పరిమితం కావాలని ఆయన కోరారు.

Read This: దేశంలో తొలి కరోనా టెస్టింగ్ కిట్ వెనుకున్న ఆ మహిళ ఎవరంటే…

Latest Articles
అమ్మాయిలూ.! ఈ అబ్బాయిలు చాలా రొమాంటిక్.. దొరికితే మీరు చాలా లక్కీ
అమ్మాయిలూ.! ఈ అబ్బాయిలు చాలా రొమాంటిక్.. దొరికితే మీరు చాలా లక్కీ
'కూటమి మేనిఫెస్టోలో మోదీ, పవన్ ఫోటోలు మాయం'.. మాజీమంత్రి
'కూటమి మేనిఫెస్టోలో మోదీ, పవన్ ఫోటోలు మాయం'.. మాజీమంత్రి
పోటీపడుతున్న ప్రభాస్.. తారక్.. ఇంతకీ పోటీలో నెగ్గేదెవరు
పోటీపడుతున్న ప్రభాస్.. తారక్.. ఇంతకీ పోటీలో నెగ్గేదెవరు
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. కట్ చేస్తే టాలీవుడ్ టాప్ హీరోయిన్..
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. కట్ చేస్తే టాలీవుడ్ టాప్ హీరోయిన్..
బాబోయ్ ఇదేం ట్విస్ట్.. లిక్కర్ బాటిల్స్ ధ్వంసం చేస్తుండగా...
బాబోయ్ ఇదేం ట్విస్ట్.. లిక్కర్ బాటిల్స్ ధ్వంసం చేస్తుండగా...
ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ మండలాల్లో తీవ్రవడగాల్పులు..
ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ మండలాల్లో తీవ్రవడగాల్పులు..
టార్గెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రంగంలోకి ప్రధాని మోదీ
టార్గెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రంగంలోకి ప్రధాని మోదీ
CSKకు దెబ్బ మీద దెబ్బ.. జట్టును వీడిన స్టార్ ప్లేయర్లు.. కారణమిదే
CSKకు దెబ్బ మీద దెబ్బ.. జట్టును వీడిన స్టార్ ప్లేయర్లు.. కారణమిదే
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
కేసులపై తగ్గేదేలే.. బీజేపీ టార్గెట్‎గా సీఎం రేవంత్ కీలక ఆరోపణలు..
కేసులపై తగ్గేదేలే.. బీజేపీ టార్గెట్‎గా సీఎం రేవంత్ కీలక ఆరోపణలు..