రైస్‌లో షుగర్ లెవెల్స్ తగ్గించే కుక్కర్లు వచ్చేశాయి! కనిపెట్టింది మన తెలుగు సైంటిస్ట్
బాపట్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డోనేపూడి సందీప్ రాజా గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉండే విధంగా రైస్ కుక్కర్‌ను రూపొందించారు. ఈ కుక్కర్‌లో ఉడికించిన బియ్యం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు. ఈ ఆవిష్కరణకు పేటెంట్ లభించింది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

సాంకేతిక విప్లవంతో అనేక వినూత్న పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఏఐ టెక్నాలజీతో కూడిన అనేక వస్తువులు మన ఇంట్లో తిష్టవేస్తున్నాయి. ఇందులో భాగంగానే స్మార్ట్ వాచ్, స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో బాపట్ల సైంటిస్ట్ మరొక వినూత్న పరికరాన్ని కనుగొన్నారు. స్మార్ట్ కుక్కర్‌ను తయారు చేసి అందరి చేత ఔరా అనిపించుకుంటున్నారు. బాపట్ల వ్యవసాయ కాలేజ్ లోని పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ లో డోనేపూడి సందీప్ రాజా పనిచేస్తున్నారు. ఈ సైంటిస్ట్ సరికొత్త సాంకేతికతను ఉపయోగించి వివిధ పరికరాలను తయారు చేస్తున్నారు.
ఇందులో భాగంగానే ఇతను తయారు చేసిన కుక్కర్ కు పెటేంట్ లభించింది. మనం తింటున్న ఆహార పదార్ధాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయిలు అధికంగా ఉంటున్నారు. ఈ జీఐ అధికంగా ఉన్న ఆహార పదార్ధాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. దక్షిణ భారత దేశంలో ఎక్కువ మంది తింటున్న రైస్ లో జీఐ వలనే అధిక చక్కెర ఉంటుంది. అయితే ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ ను తగ్గించేలా కుక్కర్ తయారు చేశారు సందీప్ రాజా. ఈ కుక్కర్ లో బియ్యాన్ని ఉడికిస్తే ఈ జిఐ స్థాయి చాలా తక్కువుగా ఉంటుంది. దీంతో అన్నం తిన్నప్పటికీ చక్కెర స్థాయి పెరగదు.
జిఐ స్థాయి తక్కువుగా ఉండటంతో అన్నం చాలా నెమ్మదిగా జీర్ణం అవుతోంది. జిఐ స్థాయిని తగ్గించే కుక్కర్ కావడంతో దీనికి పెటేంట్ వచ్చింది. త్వరలోనే ఇది మార్కెట్ లోకి అందుబాటులోకి రానుంది. జిఐ స్థాయి తగ్గించే కుక్కర్ ను కునగొన్న సందీప్ రాజా ను పలువురు అభినందిస్తున్నారు. గతంలో రాజా రూపొందించిన మరో రెండు పరికరాలకు కూడా పెటేంట్ లభించినట్లు ఆయన సన్నిహితులు చెప్పారు. సందీప్ రాజా ఆవిష్కరించిన కుక్కర్ అందుబాటులోకి వస్తే మధుమేహ వ్యాధి గ్రస్తులకు అది వరంగా మారే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
