AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆవేశంలో నోరు జారాను.. వారిని ఉద్దేశించి.. అలా మాట్లాడి ఉండాల్సింది కాదుః అంబటి

ఆవేశంలో నోరు జారాను.. వారిని ఉద్దేశించి.. అలా మాట్లాడి ఉండాల్సింది కాదుః అంబటి

Balaraju Goud
|

Updated on: Jan 31, 2026 | 6:26 PM

Share

తిరుమల లడ్డూ వ్యవహారంపై నిరసన చేపట్టిన వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు వెనక్కి పంపుతున్న క్రమంలోనే కారులోనే ఉన్న అంబటి.. సీఎం చంద్రబాబుపైనా, టీడీపీ నేతలపైనా తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంబటి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఏపీలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. సిట్ నివేదిక రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. సిట్ నివేదిక జంతు కొవ్వు లేదని తేల్చడంతో వైసీపీ నేతలు ఆందోళన బాటపట్టారు. ఈ క్రమంలోనే నిరసన చేపట్టిన వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు వెనక్కి పంపుతున్న క్రమంలోనే కారులోనే ఉన్న అంబటి.. సీఎం చంద్రబాబుపైనా, టీడీపీ నేతలపైనా తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంబటి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన అంబటిని అరెస్టు చేయాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు డిమాండ్లు చేస్తున్నారు.

మరోవైపు అంబటి రాంబాబు దీనిపై స్పందించారు. చట్టవ్యతిరేకంగా మాజీ సీఎం ఫ్లెక్సీని ఏర్పాటు చేశారని, ఆ ఫ్లెక్సీని చించడానికి తాను వెళ్లలేదని తెలిపారు. తాను చంద్రబాబును తిట్టినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అంబటి రాంబాబు పేర్కొన్నారు. తనపై కొందరు దాడి చేసేందుకు ప్రయత్నించడంతో ఆవేశంలో కొందరిపై నోరు జారానని వివరించారు. అయితే వారిని ఉద్దేశించి కూడా అలా మాట్లాడి ఉండాల్సింది కాదన్నారు. చంద్రబాబును తిట్టాననే ఆరోపణలతో తనను అరెస్ట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని అంబటి రాంబాబు ఆరోపించారు. అరెస్ట్‌లకు భయపడేది లేదన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Jan 31, 2026 06:26 PM