నేషనల్ అవార్డ్ యాక్టర్.. కోలీవుడ్ హీరో ధనుష్ ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో ప్రాజెక్ట్ ఓకే చేశారట.
ప్రస్తుతం ఆయన D55 చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ ఎవరనే విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఆమె గురించి వెల్లడించారు.
ధనుష్ 55వ చిత్రానికి రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించనున్నారు. గతంలో ఆయన తెరకెక్కించిన అమరన్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ధనుష్ సరసన శ్రీలీల నటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇటీవలే పరాశక్తి సినిమాతో తమిళ సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీకి నిరాశే ఎదురయ్యింది.
పరాశక్తి సినిమా డిజాస్టర్ అయ్యింది. అలాగే శ్రీలీల లుక్స్, యాక్టింగ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆమెకు తమిళంలో మరో అవకాశం వచ్చింది.
ధనుష్ - శ్రీలీల కలిసి నటించడం ఇదే తొలిసారి. దీంతో వీరిద్దరి కాంబో గురించి అభిమానులు వెయిట్ చేస్తున్నారు. వుండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సాయి అభ్యాంకర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీలకు తెలుగులో కలిసి రావడం లేదు. ఆమె నటించిన చిత్రాలన్ని వరుసగా ప్లాప్ అవుతున్నాయి.
అటు తమిళంలోనూ మొదటి సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఈ క్రమంలోనే తాజాగా తమిళంలో మరో ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.