AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Rains: చల్ల చల్లని కూల్ న్యూస్.. ఏపీకి వచ్చే 3 రోజులు ఉరుములతో వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్

ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉండనుంది. వాతావరణ శాఖ కీలక సూచనలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. అలాగే ఉరుములు, మెరుపులు కూడా పడే ఛాన్స్ ఉందట. ఆ వివరాలు..

AP Rains: చల్ల చల్లని కూల్ న్యూస్.. ఏపీకి వచ్చే 3 రోజులు ఉరుములతో వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్
Ap Rains
Ravi Kiran
|

Updated on: Apr 26, 2025 | 1:24 PM

Share

నిన్నటి మధ్య మహారాష్ట్ర దక్షిణ ప్రాంతాల నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించియున్నది.

వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు : ———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

ఈరోజు , రేపు, ఎల్లుండి:- —————————————-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది . ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు ౩౦-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:- ——————————–

ఈరోజు ,రేపు, ఎల్లుండి:- —————————————-

వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది.

రాయలసీమ:- ——————-

ఈరోజు, రేపు:- —————————————-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది . ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు ౩౦-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

గమనిక:- కోస్తా ఆంద్రప్రదేశ్ , యానాం, రాయలసీమలో రాగల 2 రోజుల్లో వేడి తేమ, అసౌకర్యమైన వాతావరణముతో పాటు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో రానున్న 5 రోజుల్లో గణనీయమైన మార్పు లేదు.