Heroines : ముద్దుగుమ్మల కోసం స్పెషల్ క్యాలెండర్.. మైసౌత్‌దివా 9వ ఎడిషన్ 2026 రిలీజ్..
మైసౌత్‌దివా (MySouthDiva) 9వ ఎడిషన్ 2026 క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించింది. మీడియా9 & భారతి సిమెంట్స్ సంయుక్తంగా నిర్వహించిన ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఫిల్మ్ నగర్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీమణులు శ్రియా శరణ్, అనన్య నాగళ్ల, రియా సచ్ దేవా పాల్గొన్నారు.

దక్షిణ భారతదేశంలోని ప్రముఖ డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్, లైఫ్‌స్టైల్ ప్లాట్‌ఫామ్ మైసౌత్‌దివా (MySouthDiva) తన ఎంతో ప్రతిష్టాత్మకమైన 9వ ఎడిషన్ 2026 క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించింది. మీడియా9 & భారతి సిమెంట్స్ సంయుక్తంగా నిర్వహించిన ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఫిల్మ్ నగర్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ప్రత్యేక క్యాలెండర్‌లో దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీమణులు శ్రియా శరణ్, అనన్య నాగళ్ల, రియా సచ్ దేవా, ఉల్క గుప్తా, పాలక్ అగర్వాల్, మనస్వి మంగై, చాంద్సీ కటారియా, సాక్షి మ్హాడోల్కర్, సిమ్రత్ కౌర్, గెహ్నా సిప్పీ, రియా సుమన్, ఐశ్వర్య సాల్వి తదితరులను 12 నెలలు 12 మంది నటీమణులను ప్రచురించారు. స్టైల్, గ్రేస్, ఆధునిక ఫ్యాషన్ ట్రెండ్స్‌కు అద్దం పడుతూ రూపొందిన ఈ క్యాలెండర్ ప్రతి నెల ఒక ప్రత్యేక థీమ్‌తో మహిళా శక్తి, ఆత్మవిశ్వాసం మరియు వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
ఈ కార్యక్రమంలో టాలీవుడ్ నటీమణులు, మోడల్స్ గెహ్నా సిప్పీ, రియా సచ్ దేవా, ఐశ్వర్య సాల్వి, ఉల్క గుప్తా, భారతి సిమెంట్స్ డీఎం రవీంద్ర రెడ్డి, సినీ నిర్మాతలు రమేష్ పుప్పాల, శ్యాంసుందర్ నేతి, మీడియా9 డైరెక్టర్ మనోజ్ కుమార్ తదితర ప్రముఖులు హాజరై కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చారు. ఈ సందర్భంగా మైసౌత్‌దివా డైరెక్టర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ.. “ఈ క్యాలెండర్ ప్రతిభ, అందం, ఆత్మబలం వంటి విలువలను సెలబ్రేట్ చేసే మా దృష్టిని ప్రతిబింబిస్తుంది. యువతులను ప్రేరేపిస్తూ, మీడియాలో సానుకూల ప్రతిబింబాన్ని తీసుకురావడమే మా లక్ష్యం. ప్రతి నెల ఒక ప్రత్యేక భావనతో మహిళా శక్తిని ప్రతినిధ్యం వహిస్తుంది” అని తెలిపారు.
మీడియా 9 దక్షిణ భారతదేశంలో ప్రముఖ సెలబ్రిటీ మేనేజ్‌మెంట్ కంపెనీగా గుర్తింపు పొందింది. ఇప్పటివరకు 300కి పైగా ప్రకటనలకు కాస్టింగ్ నిర్వహించడంతో పాటు, ఫలక్‌నుమా దాస్ వంటి మూడు విజయవంతమైన చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించింది. సినిమాలు, సెలబ్రిటీలు, బ్రాండ్స్‌కు వినూత్న డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్ అందించడమే లక్ష్యంగా మీడియా9 పనిచేస్తోంది. మీడియా9 వ్యవస్థాపకుడు, ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్, కంటెంట్ క్రియేటర్ అయిన మనోజ్ కుమార్ కటోకర్ ఈ క్యాలెండర్ ఆవిష్కరణను ఘన విజయంగా మార్చడంలో సహకరించిన అన్ని సెలబ్రిటీలు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఇద్దరూ అక్కాచెల్లెల్లు.. ఒకరు స్టార్ హీరోయిన్.. మరొకరి జీవితం విషాదం.. ఎవరంటే..
