ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు.. వరుస హిట్లతో గత్తరలేపుతున్న హీరోయిన్..

Rajitha Chanti

Pic credit - Instagram

31 January 2026

ప్రస్తుతం భారతీయ సినిమా ప్రపంచంలో ఓ హీరోయిన్ చక్రం తిప్పుతుంది. తెలుగు, హిందీ భాషలలో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదుంది. 

ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల పారితోషికం తీసుకుంటుంది. అంతేకాదు ఆమె ఇప్పుడు బాక్సాఫీస్ క్వీన్.. అలాగే నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకుంది.

ఆమె మరెవరో కాదండి హీరోయిన్ రష్మిక మందన్న. సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ లోనూ అత్యధిక పారితోషికం తీసుకుంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

తక్కువ కాలంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటుంది. కొడగులోని విరాజ్‌పేటకు చెందిన రష్మి, తన స్వస్థలమైన కొడగులో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లింపుదారు కూడా.

ఆమె 2016లో విడుదలైన కన్నడ చిత్రం కిరిక్ పార్టీ ద్వారా హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత, గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి హిట్స్ అందుకుంది.

పుష్ప సినిమాతో ఆమె పేరు పాన్ ఇండియా లెవల్లో మారుమోగింది. ఈ సినిమా తర్వాత యానిమల్, ఛావా, కుబేర చిత్రాలతో నటిగా తనదైన ముద్ర వేసింది రష్మిక

ప్రస్తుతం రష్మిక వయసు 29 సంవత్సరాలు. నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ.66 కోట్లు. ఆమె ఒక్కో సినిమాకు దాదాపు రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది.

రష్మిక మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్, రేంజ్ రోవర్ స్పోర్ట్‌తో సహా అనేక రకాల అగ్రశ్రేణి కార్లను కూడా కలిగి ఉంది. ఇప్పుడు ఆమె చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.