VPCI Recruitment: వల్లభాయ్ పటేల్ చెస్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. అర్హులు ఎవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
VPCI Recruitment: యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీ వల్లభాయ్ పటేల్ చెస్ట్ ఇన్‌స్టిట్యూట్(VPCI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉన్నఈ వైద్య సంస్థలో..
VPCI Recruitment: యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీ వల్లభాయ్ పటేల్ చెస్ట్ ఇన్‌స్టిట్యూట్(VPCI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉన్నఈ వైద్య సంస్థలో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 03 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో మెడికల్ ఆఫీసర్(సీనియర్ రీసెర్చ్ ఫెలో)01, సోషల్ వర్కర్(ఫీల్డ్ ఆఫీసర్)01, ల్యాబొరేటరీ అటెండెంట్01 ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, ఎంబీబీఎస్ ఉత్తీర్ణులవ్వాలి.
* వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను ది ఆఫీస్ ఆఫ్ ద డిప్యూటీ రిజిస్ట్రార్, వల్లభాయ్ పటేల్ చెస్ట్ ఇన్‌స్టిట్యూట్, యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీ, ఢిల్లీ110007 అడ్రస్‌కు పంపించాలి.
* ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 15,070 నుంచి రూ.35,000 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 20-01-2022 చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: KTR: కేంద్ర ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్.. నెటిజన్ కోరికపై మంత్రి ఎలా స్పందించారో తెలుసా.?
Indian Army New Uniform: హై టెక్నాలజీతో ఇండియన్ ఆర్మీ యూనిఫామ్.. ఎలా తయారు చేశారో తెలుసా..