BEL Recruitment: ఎల్ఎల్‌బీ చేసిన వారికి ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌లో ఉద్యోగాలు… పూర్తి వివ‌రాలు..

BEL Recruitment: భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌(BEL) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌కి చెందిన ఈ సంస్థ బెంగ‌ళూరులోని కార్యాల‌యంలో..

BEL Recruitment: ఎల్ఎల్‌బీ చేసిన వారికి ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌లో ఉద్యోగాలు... పూర్తి వివ‌రాలు..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 14, 2022 | 6:06 AM

BEL Recruitment: భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌(BEL) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌కి చెందిన ఈ సంస్థ బెంగ‌ళూరులోని కార్యాల‌యంలో ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎవ‌రు అర్హులు లాంటి పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న‌ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 05 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో అసిస్టెంట్ కంపెనీ సెక్రెట‌రీ(ఏసీఎస్‌), అసిన్టెంట్ మేనేజ‌ర్‌(లీగ‌ల్‌) పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ(ఎల్ఎల్‌బీ/బీఎల్‌), ఐసీఎస్ఐలో స‌భ్య‌త్వం ఉండాలి.

* అభ్య‌ర్థుల వ‌య‌సు 32 ఏళ్లు మించ‌కూడ‌దు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆఫ్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ద‌ర‌ఖాస్తుల‌ను డిప్యూటీ మేనేజ‌ర్‌, భార్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్, కార్పొరేట్ ఆఫీస్‌, అవుట‌ర్ రింగ్ రోడ్‌, బెంగ‌ళూరు, 560045 అడ్ర‌స్‌కు పంపించాలి.

* అభ్య‌ర్థుల‌ను రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.

* ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ. 50,000 నుంచి రూ. 1,60,000 వ‌ర‌కు చెల్లిస్తారు.

* ద‌ర‌ఖాస్తు చేసుకునే ఎస్సీ/ఎస్టీ/పీడ‌బ్ల్యూబీడీ అభ్య‌ర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. ఇత‌రులు రూ.750 చెల్లించాలి.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ 05-02-2022తో ముగియ‌నుంది.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Gmailలో ఈ ఫీచర్‌ని ఎప్పుడైనా ఉపయోగించారా.. ఇందులో నుంచి సీక్రెట్ ఇమెయిల్ పంపవచ్చు తెలుసా..

Health Benefits of Desi Ghee: దేశీ ఆవు నెయ్యి ఎందుకు తినాలో.. లాభాలు ఏంటో తెలుసుకోండి..

PM Modi Review Meeting: కోవిడ్‌ వ్యాప్తి, నివారణా చర్యలపై సీఎంలతో ప్రధాని వర్చువల్‌ సమావేశం..